Chanakya Neeti : అపర చాణక్యుడు చెప్పిన కొన్ని జీవిత సూత్రాలు ఇప్పటికీ కొందరికి ఉపయోగపడుతున్నాయి. ఈ ఆర్థిక వేత్త రాజనీతికి సంబంధించిన విషయాలే కాకుండా ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను మౌర్య కాలంలోనే చెప్పాడు. ఆ విలువైన సూత్రాలను ఇప్పుడు కొందరు పాటిస్తూ వస్తున్నారు. అయితే చాణక్యుడు ప్రధానంగా డబ్బు గురించి కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు. ఆయన చెప్పిన ప్రకారం.. మనిషి జీవితం నడవాలంటే డబ్బు తప్పనిసరి. అయితే డబ్బు కోసం మాన విలువలను తాకట్టు పెట్టరాదని సూచించాడు. జీవితంలో డబ్బు, మనశ్శాంతి కి చాలా తేడా ఉంటుందని, అధిక డబ్బు కోరుకుంటే మనశ్శాంతి దూరమవుతుందని చెప్పాడు. అయితే వచ్చిన డబ్బును ప్రణాళిక పరంగా ఖర్చు పెట్టడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారని చెప్పారు. మరి చాణక్యుడు చెప్పిన ప్రకారంగా డబ్బును ఎలా ఖర్చు చేయాలి? ఏవిధంగా పెట్టుబడి పెట్టాలి? అనే విషయాలు చెప్పాడు.
డబ్బు కోసం అందరూ కష్టపడుతారు. కానీ దీనిని ఖర్చు చేయడంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా కొందరు ఉద్యోగుల జీతం పెరగగా.. లేదా వ్యాపారులకు కాస్త ఆదాయం పెరగడంతో అదనపు ఖర్చులు పెంచుకుంటారు. అయితే ఆదాయం అన్ని వేళలా ఒకే మాదిరిగా ఉండదని గుర్తించాలి. దీంతో ఆదాయం పెరిగినప్పుడు దానిని పొదుపు చేసే అలవాటు చేసుకోవాలి. లేకుంటే ఉన్న డబ్బు ఖర్చయి మనశ్నాంతిని కోల్పోతారు.
చాణక్య నీతి ప్రకారం.. డబ్బును ఇంట్లో, బీరువాలో దాచుకుంటే అది రెట్టింపు కాదు. దీనిని వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. అప్పుడే దాని విలువ పెరుగుతుంది. అయితే పెట్టుబుడులు పెట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన కొన్నింటిలో మాత్రమే ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. అనాలోచితండగా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలే వస్తాయి.
జీవిత అవసరాల కోసం డబ్బు సంపాదించడం అందరూ చేసేదే. కానీ అత్యాశ కొందరికి ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి కంటే తాను ఎక్కువడా డబ్బు సంపాదించాలని కోరుకునే వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు నిత్యం డబ్బు గురించి ఆలోచించి మనశ్శాంతిని కోల్పోతారు. అందువల్ల డబ్బు విషయంలో దురాశను వీడాలి.
సంతోషంగా ఉండడానికే డబ్బు సంపాదిస్తారు.ఈ డబ్బుతో ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. కానీ డబ్బు వల్ల సమ్యలు తెచ్చుకోకూడదు. డబ్బు విషషయంలో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి. ఇంట్లోనూ డబ్బే ప్రధానం అయితే మనుషుల మధ్యభేదాభిప్రాయాలు వస్తాయి.
మనుషులు చేసే ప్రతీ కార్యం దైవానుగ్రహంతోనే అంటారు. మంచి పనులు చేయడం వల్ల దైవానుగ్రహం ఉంటుంది. డబ్బుకు ప్రతిరూపం లక్ష్మీ. డబ్బు కోరుకునేవారు లక్ష్మీదేవి అమ్మవారిని కొలుస్తూ ఉండాలి. కొన్ని నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ధనం కనిపిస్తుంది. లేకుంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వచ్చి సమస్యలు ఏర్పడుతాయి. పాజిటివ్ ఎనర్జీ కోసం రోజూ కాకపోయినా ప్రతీ శుక్రవారం అమ్మవారిని సేవిస్తూ ఉండాలి. అప్పుడే సంపాదించిన డబ్బు ఇంట్లో నిలుస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.