Fruit Chat : మామిడి సీజన్ వచ్చిందంటే చాలు.. ఇక అందరూ వాటిపై ఉప్పు, కారం చల్లుకుని తింటారు. పుల్లటి మామిడి కాయపై ఉప్పు, కారం చల్లి తింటే టేస్ట్ అదిరిపోద్ది. అయితే ఈ రుచిని ఆస్వాదించాలంటే కేవలం వేసవిలో మాత్రమే సాధ్యం. కేవలం మామిడిపై మాత్రమే కాకుండా నేరేడు పండ్లు, రాసి ఉసిరి కాయలపై కూడా ఉప్పు, కారం చల్లుకుని తింటారు. అయితే ఇవి కూడా సీజనల్‌గా దొరుకుతుంటాయి. ఇలా కొన్ని పదార్థాలకు మాత్రమే కాకుండా అన్ని రకాల పండ్లపై కూడా కొందరు ఉప్పు, కారం, మసాలా చల్లుకుని తింటారు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని వీటిని తింటుంటారు. రోజూ వీటిని తినడం వల్ల హెల్తీగా ఉండటంతో పాటు యంగ్‌గా కూడా ఉంటారు. ముఖ్యంగా డైట్ ఫాలో అయ్యేవాళ్లు పండ్లు తినకుండా అస్సలు ఉండరు. అయితే వీటిని తినాల్సిన పద్ధతిలో మాత్రమే తినాలి. లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు అంటున్నారు. అదేంటి పండ్లను సాధారణంగా లేదా జ్యూస్, ఫ్రూట్ సలాడ్స్‌గా తింటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కదా. ఇంకా ఏలా వీటిని తింటారు అని ఆలోచిస్తున్నారా. పండ్లను ఇలా మాత్రమే కాకుండా కొందరు వాటిపై ఉప్పు, కారం, మసాలా చల్లి తింటుంటారు. ఎక్కువగా పుచ్చకాయ, అనాస పండు, జామకాయ మీద చల్లుకుని తినడానికి మక్కువ చూపిస్తుంటారు. ఇలా తినడం వల్ల మీకు టేస్టీ అనిపించవచ్చు. కానీ శరీరానికి హాని చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పండ్లపై కారం, మసాలా, ఉప్పు వంటివి చల్లుకుని తినడం వల్ల అందులోని పోషకాలు తగ్గుతాయి. అందులో ఉండే మినరల్స్, విటమిన్లు నీరు ద్వారా బయటకు వచ్చేస్తాయి. దీంతో పండ్లులోని పోషకాలు శరీరానికి అందవు. మీరు పండ్లు తిన్నా దాని ఫలితం ఉండదు. అలాగే కారం, ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అంత మంచిది కాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందర చక్కెర కూడా వేసుకుని తింటారు. చక్కెర అంటే ఇష్టం ఉన్నవాళ్లు పండ్లపై వేసుకుంటారు. దీనివల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. దీంతో మీరు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. వీటివల్ల కిడ్నీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఉప్పులోని సోడియం బాడీలో ఎక్కువగా ఉండిపోవడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మీకు చిరాకుగా అనిపిస్తుంది. పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల శరీరంలో ఉప్పు పరిమాణం పెరుగుతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. అలాగే గుండె సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే రుచిగా ఉండటంతో పాటు కొత్తగా ట్రై చేయాలనుకుంటే పండ్లపై యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాల పొడి చల్లుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారు.