Sleeping: సాధారణంగా ప్రతి మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. ఈ క్రమంలోనే రోజుకు కనీసం ఆరు నుంచి ఏడు గంటలు అయినా నిద్రపోవాలి. ఇలా అయితేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. అయితే కొందరు సరిగా నిద్రపోలేరు. ఈ కారణంగా చాలా బలహీనంగా ఉంటారు. అనారోగ్యానికి గురి కావడంతో పాటు నీరసానికి గురి అవుతారు. ఏ పని చేయలేరు. దేనిపైనే దృష్టి సారించలేరు.
నిద్రలేమి కారణంగా మనిషి అనారోగ్యానికి గురి కావడంతో పాటు మానసిక సమస్యలను కూడా ఎదుర్కొవాల్సి వస్తుందని తెలుస్తోంది. మంచి నిద్ర వలనే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుంది. మెదడు పనితీరు, అభివృద్ధిలో కూడా నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. పురాణాలు సైతం నిద్ర గురించి చెప్పిన విషయం తెలిసిందే. రాత్రి మొదటి భాగంలో నిద్రించాలని, బ్రాహ్మ ముహుర్తంలో నిద్ర లేవాలని పురాణాల్లో పేర్కొనబడింది.
ఈ మధ్య కాలంలో చాలా వరకు ఫోన్లు చూస్తూ నిద్రకు కొందరు దూరం అవుతున్నారు. మరి కొంతమందికి ఇతర కారణాల వలన నిద్రపట్టదు. అలాంటి సమయంలో నిద్రపోలేరు. నిద్ర పోయినప్పటికీ మధ్యలో మెలుకువ వస్తుంది. కానీ మళ్లీ నిద్రపట్టక ఇబ్బందులు పడుతుంటారు.
అలాగే కొందరు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఎవరో చెప్పినట్లు నిద్రలేస్తుంటారు. అయితే దానికి ఓ కారణం ఉందంట. ఆ సమాయాన్ని సమయాన్ని బ్రాహ్మ ముహుర్తం అంటారు. ఆ సమయంలో ఏ పని చేసినా విజయవంతం అవుతుందని పురాణాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీకు కూడా 3 నుంచి 5 గంటల మధ్య మీకు మెలుకువ వస్తే అది మంచికే దారి తీస్తుందని పలువురు చెబుతున్నారు. భవిష్యత్ లో జరిగే విషయాలను తెలియజేసే ఒక సూచన అని దీన్ని భావించవచ్చట. ఈ క్రమంలోనే నిద్ర లేవగానే అరచేతులను చూసుకోవాలట. తరువాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానాధికాలు ముగించాలని చెబుతున్నారు. అనంతరం భగవంతుడిని ప్రార్థిస్తే అనుకున్నది జరుగుతుందని కొన్ని పురాణాల్లో పేర్కొన్నారని సమాచారం.