Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే వీక్ నడుస్తుంది. ఇప్పటికే ముగింపు దశకు చేరుకోగా .. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తున్నారు. ఇక ఆ రోజే టైటిల్ విన్నర్ ని కూడా ప్రకటిస్తారు. అయితే ఈ ఫినాలే వీక్ లో భాగంగా టాప్ 6 కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలు .. వారి ఆట తీరు పై బిగ్ బాస్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా అంబటి అర్జున్ బిగ్ బాస్ జర్నీ వీడియో చూపించారు బిగ్ బాస్.
ముందుగా అర్జున్ గార్డెన్ ఏరియా లో ఏర్పాటు చేసిన తన ఫోటో గాలరీ చూస్తూ తెగ సంబరపడిపోయాడు. ఇక బిగ్ బాస్ అర్జున్ గొప్పతనం గురించి మాట్లాడారు. ‘ అర్జున్ మీరు వచ్చిన మొదటి రోజు నుంచి ఎవరు కదపలేని ఏకాగ్రతను చూపిస్తూ ఒక్కొక్కటిగా టాస్కుల్లో గెలుస్తూ మీ లక్ష్యం వైపు దూసుకెళ్లారు. మీ ప్రత్యర్థులకు మాటలతో తక్కువగా .. చేతలతో ఎక్కువగా సమాధానం చెప్పారు.
ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా .. మీరు అనుకున్న విషయం .. మీరు గట్టిగా వినిపించారు. ఇప్పుడు మీ భార్యకి మీ తోడు ఎంత అవసరమో తెలిసినా .. లక్ష్యం చేరాలనే మీ పట్టుదల మీ ఆట గురించి ఆలోచించేలా చేసింది. ఆ కల మీ ఒక్కరిదే కాదు మీలో సగమైన .. మీ భార్యది. ఆ ప్రేమే మిమ్మల్ని ముందుకు నడిపింది అని బిగ్ బాస్ చెప్పారు.
ఇక అర్జున్ ‘ బిగ్ బాస్ కి వచ్చి గెలవాలనే ఆశ నాకు ఎంత ఉందో నా భార్యకు కూడా అంతే ఉంది. ఈ మెమరీస్ .. జర్నీ ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను బిగ్ బాస్’ అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇక తన భార్య ఫోటో చూస్తూ అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. ఇది ఇలా ఉండగా .. అర్జున్ విన్నర్ ఓటింగ్ రేస్ లో వెనకబడి ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను టైటిల్ కొట్టే ఛాన్స్ మాత్రం లేదు. కాగా ప్రశాంత్ లేదా శివాజీ లో ఒకరు కప్పు కొడతారు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.