Homeఎంటర్టైన్మెంట్Rajinikanth Birthday: ఓ కండక్టర్ స్టార్ హీరో ఎలా అయ్యాడు..ఆసక్తికర రజినీకాంత్ నట ప్రస్థానం...

Rajinikanth Birthday: ఓ కండక్టర్ స్టార్ హీరో ఎలా అయ్యాడు..ఆసక్తికర రజినీకాంత్ నట ప్రస్థానం…

Rajinikanth Birthday: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ తనకంటూ ఒక మార్క్ ని సెట్ చేసుకున్నాడు అలాగే తమిళం తోనే పరిమితం అవ్వకుండా తెలుగు, హిందీ లాంటి భాషల్లో కూడా తన సత్తా ఏంటో చూపించుకున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరో రజనీకాంత్…ఆయన చెప్పిన డైలాగ్ ఒక ప్రభంజనం అవుతుంది.ఆయన ఏది చేసిన అదొక ట్రెండ్ అవుతుంది. సిగరెట్ పైకి ఎగరెయ్యాలన్న దాన్ని నోట్లోకి విసిరేయలన్న అది ఆయనకే సొంతం…

వెంట్రుకల్ని పైకి లేపుతూ ఆయన నడిచే వాకింగ్ స్టైల్ జనాల్లో ఇప్పటికీ గుర్తుండిపోతుంది అంటే ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి ఎగ్జాంపుల్ గా రజనీకాంత్ ని చెప్పుకోవచ్చు. బస్ కండక్టర్ గా పని చేసిన ఆయన సూపర్ స్టార్ అనే రేంజ్ కి ఎదిగాడు అంటే ఆయన అకుంటిత దీక్ష ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు…అలాంటి సూపర్ స్టార్ బర్త్ డే ఈ రోజు అవడం వల్ల ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం…

రజనీకాంత్‌ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌…ఈయన మొదటగా బస్‌ కండక్టర్‌గా పని చేశారు కానీ అంతకంటే ముందు ఆయన ఒక కూలీగా, ఒక కార్పెంటర్‌గా పనిచేశారు.ఇక సినిమా మీద ఆయనకి ఉన్న ఇంట్రెస్ట్ తో ఆయన యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయి యాక్టింగ్ కి సంభందించిన మెళుకువలు నేర్చుకొని ఇండస్ట్రీ లో రాణించాలనే ఉద్దేశ్యం తో ఆయన నటుడి గా మారారు.
రజనీకాంత్‌ నటించిన మొదటి తమిళ చిత్రం అపూర్వ రాగంగళ్‌ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో ఆయన హీరోగా చాలా సినిమాల్లో నటించాడు.ఇక రజినీకాంత్ బెంగళూరులోని ఓ గుడిలో కూర్చొని ఉండగా అక్కడున్న యాచకులు ఆయన చేతిలో డబ్బులు వేశారట! ఆ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటు నేనేంటో ఆ సంఘటనే తెలియజేసింది అంటూ చెబుతూనే ఆయన ఎప్పుడూ పబ్లిక్ గా వచ్చిన కూడా నాచురల్ గానే మేకప్, విగ్గు లాంటివి ఏమీ లేకుండా వస్తాను అని చెప్పాడు…

ఇక మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన దళపతి సినిమా షూటింగ్ టైం లో బాగా అలసి పోయిన అరవింద సామి తన రూం అనుకొని రజినీకాంత్ రూం లోకి వెళ్లి పడుకున్నాడు. ఇక రజినీకాంత్ వచ్చే టైం లో అరవిందసామి మంచి నిద్ర లో ఉండటంతో ఆయన్ని లేపడం ఎందుకు అని అక్కడే కింద పడుకున్నాడట ఇక అది చూసిన అరవిందసామి చాలా ఆశ్చర్యానికి గురైయ్యారు. అప్పటికే అరవింద సామికి పెద్దగా క్రేజ్ లేదు కానీ రజినీకాంత్ మాత్రం సూపర్ స్టార్ అయిన కూడా అలా చేయడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం అనే చెప్పాలి…

1996 ఎలక్షన్స్ టైమ్ లో నటి మనోరమ రజినీకాంత్ పైన కొన్ని ఘాటు వాఖ్యలు చేయడం తో ఆమె ని ఎవరు సినిమాల్లోకి తీసుకోలేదు. దాంతో రజినీకాంత్ కి ఆమె విషయం తెలిసి తన అరుణాచలం సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆమెని ఎంకరేజ్ చేశాడు…

అలాగే ఆయన సినిమాల ద్వారా సంపాదించే డబ్బులో సగం సేవ సంస్థలకి డొనేట్ చేస్తూ ఉంటాడు…ఇక పద్మ భూషణ్, పద్మ విభూషణ్ దాదా సాహెబ్ ఫాల్కే లాంటి గొప్ప అవార్డ్ లను కూడా అందుకున్నాడు…

ఇక మోహన్ బాబు హీరో గా వచ్చిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాకి కథ అందించింది కూడా రజినీకాంత్ కావడం విశేషం…ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికి ఒక మంచి సినిమా గా గుర్తింపు పొందింది…

2007 టైమ్ లో ఆసియా లోనే ఎక్కువ పారితోషికం తీసుకున్న రెండోవ నటుడు గా గుర్తింపు పొందాడు…అలాగే తన సినిమాలు ప్లాప్ అయితే చాలా మంది దర్శకులకి డబ్బులు రిటర్న్ ఇచ్చిన హీరో గా కూడా రజిని కాంత్ తన గొప్ప మనసును చాటుకున్నాడు…

ఇక రిసెంగ్ గా నెల్సన్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టి మళ్ళీ తన రేంజ్ హిట్ అంటే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular