IND vs WI: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన బ్యాట్ తో ఎన్నో సార్లు విమర్శకుల నోళ్లు మూయించాడు. కానీ ఇటీవల కాలంలో ఫామ్ లో లేకపోవడంతో సహజంగానే వేటు పడటం తెలిసిందే. ఎన్నో మార్లు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో కూడా విరాట్ పరుగుల వేటలో దూసుకుపోయి విమర్శకుల నోటికి తాళం వేశాడు.

టీ20ల్లో అత్యధిక అర్థ సెంచరీలు చేసిన ఆటగాడిగా ఖ్యాతి సాధించాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 41 బంతుల్లో 52 పరులు సాధించి తనకు తిరుగులేని నిరూపించాడు. అంతర్జాతీయ టీ 20 మ్యాచుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. తన పదునైన ఆటతో ప్రత్యర్థిని కట్టడి చేసే విరాట్ కోహ్లి కొద్ది కాలంగా ఫామ్ లో లేకపోవడంతో విమర్శల పాలైన సంగతి తెలిసిందే.

Also Read: హతవిధీ.. కాంగ్రెస్ లో ఈ పని ఏంటి? జగ్గారెడ్డి కాళ్లు పట్టుకున్నాడు..
తన కెరీర్ లో 30 అర్థ శతకాలు సాధించి తిరుగులేదనిపించాడు. తరువాత స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. అతడు కూడా 26 అర్థ సెంచరీలు నమోదు చేసి రెండో స్థానంలో నిలిచాడు. దీంతో టీమిండియా ఆటగాళ్ల ప్రతిభ చెప్పనవసరం లేదని తెలుస్తోంది. ఇప్పటికైతే తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ వచ్చే వరల్డ్ కప్ లో పట్టు సాధించి కప్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
దీంతో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత్ కు మరిన్ని విజయాలు అందించేందుకు వారు ఇంకా నూతన వ్యూహాలు నేర్చుకుని ప్రత్యర్థి జట్లను ఓటమికి గురి చేసే విధంగా చాకచక్యంగా వ్యవహరించాలని కోరుతున్నారు. భవిష్యత్ లో భారత్ ఆశలను నిలబెట్టాలని చూస్తున్నారు. దీనికి గాను వారి పటుత్వాన్ని మరింత పదును చేసుకోవాలని అభిలషిస్తున్నారు.
Also Read: ఆ ప్రాంతాల్లో కూడా స్టూడియోలు కట్టాలంట.. జగన్ పెద్ద ప్లానే వేశారే..!
Recommended Video:
