https://oktelugu.com/

Zodiac Signs: త్వరలో ఈ గ్రహంలోకి శుక్రుడు ఎంట్రీ.. దీంతో ఏ రాశుల వారికి అదృష్టం కలగనుందో ఉందో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం.. మరికొన్ని రాసిన వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 20, 2024 / 12:44 PM IST

    Zodiac Signs:

    Follow us on

    Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం.. మరికొన్ని రాసిన వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ప్రతి గ్రహం రెండేళ్ల పాటు ఒక రాశిలో ఉండి మరో రాశులోకి వెళ్తుంది. దీంతో మిగతా రాశులపై కూడా ప్రభావం పడుతుంది. ఈ ఏడాది డిసెంబర్లో శుక్రుడు తన తన స్థానం నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో మూడు రాశులపై ప్రభావం పడుతుంది. శుక్రుడు శాంతికి చిహ్నం. ఈ గ్రహం ఎవరిపై అనుకూలం ఉంటే వారికి అన్ని విజయాలు కలుగుతాయి. వీరు ఏ పని చేపట్టిన విజయవంతం అవుతుంది. ఇంతకీ ఆ అదృష్టం కలిగిన రాశులు ఏవో చూద్దాం..

    సూర్యుడి తర్వాత అతిపెద్ద గ్రహం శుక్రుడు. ఈ గ్రహం ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకే దీనిని దేవత గ్రహం అని కూడా అంటారు. ఈ గ్రహం సంపదకు, సంతోషానికి అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. ఇది ఏ రాశిలో ప్రవహిస్తుందో మిగతా రాశిలపై ప్రభావం పడి వారికి అన్నీ అనుకూల ఫలితాలు కలుగుతాయి. శుక్రుడు ఒక గ్రహంలో బలంగా ఉన్నట్లయితే వారికి అనుకోని అదృష్టం కలుగుతుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. భార్య భర్తల మధ్య బంధం పెరుగుతుంది. అయితే శుక్రుడు బలహీనంగా ఉంటే మాత్రం కష్టాలు ఎదుర్కొంటారు. ఏకాగ్రత ఉండదు. ఆహారం తీసుకోవడంలో సమస్యలు ఉంటాయి. అందువల్ల శుక్రుడు ఏ గ్రహంలో ప్రవహిస్తాడో.. ఈ సమయంలో ఎలాంటి గ్రహాలపై ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలి.

    వృషభ రాశి: శుక్రుడు తన స్థానం మార్చుకోవడం వల్ల వృషభ రాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి వారు ఆర్థికంగా పుంజుకుంటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులు ఆర్థికంగా బలపడతారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఇవి లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

    కర్కాటకం: శుక్ర గ్రహం మార్పు వల్ల కర్కాటక రాశి వారికి అన్నీ అనుకూల ఫలితాలే ఉంటాయి. వీరికి అనుకోని అదృష్టం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందేందుకు సమయం వస్తుంది. వివాహితులు భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    సింహం: శుక్రుడి గ్రహం వల్ల ఈ రాశి వారికి అనూహ్య లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రమోషన్ తో పాటు జీవితం కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.