https://oktelugu.com/

Viral Photo : ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? ఏకంగా రూ. 40 కోట్ల పారితోషికం అందుకున్న హీరోయిన్..

ఈ ఫోటోను చూస్తున్నారా? అందులో కనిపిస్తున్న చిన్నారి ఎవరు అనుకుంటున్నారా? గుర్తు పట్టండి తను ఒక గ్లోబల్ స్టార్. హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటిస్తూ హై రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 20, 2024 / 12:45 PM IST

    Viral Photo

    Follow us on

    Viral Photo :  చిన్నప్పటి ఫోటో వైరల్ గా మారుతూ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా అనే పజిల్స్ కామన్ కదా. ఇలాంటి ఫోటోలు సెలబ్రెటీలు వారి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇవి మరింత వైరల్ అవుతుంటాయి. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరల్ గా మారింది. అంతేకాదు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోటోను చూస్తున్నారా? అందులో కనిపిస్తున్న చిన్నారి ఎవరు అనుకుంటున్నారా? గుర్తు పట్టండి తను ఒక గ్లోబల్ స్టార్. హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటిస్తూ హై రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటుంది.

    ఏకంగా ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ రూ.40 కోట్లకు పైగా వసూలు చేస్తుంటుంది. తన లైఫ్ జర్నీలో ఎన్నో వివాదాలు, మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ బ్యూటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఎన్నో దారుణమైన పరిస్థితుల నుంచి ప్రస్తుతం ప్రపంచం మెచ్చే కథానాయికగా ఎదిగింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇంతలా చెబుతున్నారు? ఆ నటి ఎవరు అని ఆలోచిస్తున్నారా? సూపర్ లేడీ ది గ్రేట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. బీహార్ లో జన్మించింది ప్రియాంక. తన గ్రాడ్యుయేషన్ తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తండ్రి ఆర్మీ అధికారి. 2002లో తమిజన్ సినిమా విడుదల అయింది. ఈ సినిమాతో తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టింది ప్రియాంక చోప్రా. విజయ్ దళపతి నటించిన ఈ సినిమాతోనే వెండితెర మీద మెరిసింది ఈ నటి.

    తన ఫస్ట్ సినిమా తమిళంలో చేసింది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ తో బాలీవుడ్ లో దూసుకొని పోయింది. ఒకానొక సమయంలో ఇండస్ట్రీని శాసించింది ప్రియాంక చోప్రా. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తన రేంజ్ ను ఏకంగా ఆకాశాన్ని తాకేలా చేసింది. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సరసన కూడా నటించింది ఈ బ్యూటీ.

    బాలీవుడ్ టాలీవుడ్ లే కాదు ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది ప్రియాంక చోప్రా. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ప్రియాంక హాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తుంది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఒక్క ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.40 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంది. ఫోర్బ్స్, డీఎన్‌ఏ వంటి ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు ఈ విషయాన్ని తెలిపాయి. ప్రియాంక వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికే చాలా రూమర్స్ చక్కర్లు కొట్టాయి.