Vastu Tips: ఇంట్లో టీవీని ఎక్కడ పెట్టాలి

ఇంట్లో ఈశాన్య మూల ఖాళీ గా ఉండాలని చెబుతుంటారు వాస్తు పండితులు. ఈశాన్యంలో టీవీని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటున్నట్టు అవుతుందట.

Written By: Swathi, Updated On : March 30, 2024 3:55 pm

Vastu Tips

Follow us on

Vastu Tips: వాస్తు ఇంటికి మాత్రమే కాదు ఇంట్లో పెట్టుకునే వస్తువుల మీద కూడా ప్రభావం చూపిస్తుంటుంది అని వాస్తు పండితులు తెలుపుతున్నారు. అందుకే ఎలాంటి వస్తువులు అయినా వాస్తుకు అనుకూలంగా ఉండేలానే అమర్చుకోవాలి. మరి ఇంట్లో టీవీని ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా? ఈ టీవీని కూడా సరైన దిశలోనే పెట్టుకోవాలట. వాస్తు శాస్త్రం ప్రకారం టీవీ ఏ దిశలో ఉండాలో ఓ సారి తెలుసుకోండి.

ఇంట్లో ఈశాన్య మూల ఖాళీ గా ఉండాలని చెబుతుంటారు వాస్తు పండితులు. ఈశాన్యంలో టీవీని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటున్నట్టు అవుతుందట. వాస్తు ప్రకారం టీవీని ఆగ్నేయంలో పెట్టుకోవాలట. ఇలా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇక బెడ్ రూమ్ లో మాత్రం కచ్చితంగా ఆగ్నేయ మూలలోనే టీవీని పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీ బెడ్ రూమ్ మధ్యలో ఉంచకూడదు అని దీని వల్ల నష్టాలు కలుగుతున్నాయి అంటున్నారు వాస్తు పండితులు.

టీవీ తూర్పు గోడకు ఆనుకొని ఉండాలట. దీని వల్ల టీవీని చూస్తున్నప్పుడు తూర్పు దిశలోనే మొహం కూడా ఉంటుంది. ఇలా చేయడం వల్ల వాస్తు ప్రకారం మంచిది అంటారు నిపుణులు. తూర్పు అభిముఖంగా కూర్చోవడం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి మెయిన్ డోర్ కు ఎదురుంగా టీవీని మాత్రం పెట్టకూడదు అంటారు నిపుణులు. దీని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీని వల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది.

నిద్రపోయే సమయంలో బెడ్ రూమ్ లో టీవీ ఉంటే దాని మీద ఏదైనా కవర్ చేయాలి. మరీ ముఖ్యంగా టీవీ బెడ్ మీద పడుకుండా చూసుకోవాలి. ఉత్తర దిశలో టీవీని పెట్టడం మంచిది. లేదంటే తూర్పు, మరీ కాదనుకుంటే పడమర దిక్కున టీవీని ఉంచుకోవాలి.