Nails Care: అమ్మాయిలకు గోర్లు పెంచుకోవాలి అని చాలా కోరికగా ఉంటుంది. ఈ ఇష్టం అబ్బాయిలకు కూడా ఉంటుంది. కొందరు ఒక వేలుకు అయినా పెంచుకుంటారు. చిటికెన వేలికి గోరును పెంచే అలవాటు ఎక్కువ మందిలో ఉంటుంది. ఇక అమ్మాయిలు పొడవు గోర్ల కోసం బ్యూటీ పార్లర్ లో ఎక్కువ ఖర్చు కూడా చేస్తున్నారు. గోర్ల పై పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞులు విస్తుపోయే విషయాలను తెలియజేశారు. అయితే మనిషి గోర్లలో 32 కంటే ఎక్కువ బ్యాక్టీరియాలు, 28 కంటే ఎక్కువ ఫంగస్ లు ఉంటాయట.
పొడవాటి గోర్లలో స్టాఫ్ ఆరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుందని అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ డీసీ కి చెందిన శాస్తవేత్తలు కనుగొన్నారు. దీని వల్ల చర్మ సంబంధ వ్యాధులు కూడా వస్తాయట. ఈ బ్యాక్టీరియాలు కేవలం గోరు కిందనే ఉంటాయట కూడా. ఇవి పెద్దగా హాని చేయవు కానీ.. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో, గాయాలు అయిన వారికి మాత్రం తీవ్రమైన ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది అన్నారు.
కొన్ని సార్లు బ్యాక్టీరియా వల్ల గోర్లలో చీము కారడం, రంగు మారడం వంటివి కనిపిస్తే ప్రమాదం అని గుర్తు పెట్టుకోండి. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే గోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లను శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రతి రోజు సబ్బు తో రెండు సార్లు అయినా క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల బ్యాక్టీరియా చేతుల్లోకి చేరకుండా ఉంటుందట.
పొడవాటి గోర్లు పెంచుకోవడం ఇష్టమే అయినా క్రిముల విషయంలో జాగ్రత్త పాటించడం ముఖ్యం. ఇక అమ్మాయిలు గోర్ల రంగు వేస్తుంటే ముందుగానే క్లీన్ చేసుకోండి. మరి ఇంకెందుకు టెన్షన్ మీ గోర్లను నీట్ గా ఉంచుకుని అందంగా ఉండే వేళ్లను సొంతం చేసుకోండి.