Cool Places In India: వేసవి అనగానే చాలా మందికి ఉష్ణోగ్రత భయం ఉంటుంది. ఈ సమయంలో భరించలేని వేడితో పాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే ఈ సమయంలో విద్యారంగం వారికి ఎక్కువగా సెలవులు వస్తుంటాయి. దీంతో విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల చల్లటి ప్రదేశాల్లోకి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయాలనుకునేవారికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే వివరాల్లోకి వెళ్తాం పదండి..
లడఖ్:
భారత్ కు నార్తలో ఉన్న లడక్ ఓ కేంద్ర పాలిత ప్రాంతం. ఇది సముద్ర మట్టానికి 3 నుంచి 6 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే శ్రీనగర్ నుంచి లేదా కాశ్మీర్ నుంచి సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ వేసవి సమయంలో 3 నుంచి 35 సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయి. కానీ శీతా కాలంలో మాత్రం మైనస్ 20 నుంచి మైనస్ 35 సెంటి గ్రేడ్ వరకు ఉంటాయి. అందువల్ల వేసవిలో ఈ ప్రదేశానికి వెళ్లి చల్లగా ఉండొచ్చు.
మున్నార్:
కేరళలోని ఇడుక్కి జిల్లాలోఉంది మున్నార్. మున్సార్ సుమారు 1600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిని దక్షిణ భారత కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. మున్నార్ కు వెళ్లాలంటే తమిళనాడులోని ఉడుమలైపెట్టై నుంచి 85 కిలోమీటర్లు, నెరియమంగళం నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. కొచ్చి, దనుష్కోటి జాతీయ రహదారిపై నుంచి మున్నార్ కు వెళ్లొచ్చు. రైల్వే ద్వారా వెళ్లాలంటే ఎర్నాకుళం నుంచి 140 కిలోమీటర్ల దూరానికి వెళ్లాల్సి ఉంటుంది.
చిరపుంజి:
మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి వేసవిలో అనువైన ప్రదేశం. ఈ భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశం కూడా ఇదే. బంగాళా ఖాతం నుంచి వీచే రుతుపవనాలు ఈ కొండ శిఖరాలను తాకడం వల్ల ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. అందుకే ఇక్కడ వేసవిలోనూ చల్లగా ఉంటుంది. సముద్ర మట్టానికి 1370 మీట్ల ఎత్తు ఉండడంతో ఇక్కడ వాతావరణంలో మార్పులు ఉంటాయి.
డార్జిలింగ్:
పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ సముద్రమట్టానికి 2 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈశాన్య భారతదేశంలో ఉండే ఈ ప్రదేశంలో వేసవిలో చల్లగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ నుంచి డార్జిలింగ్ చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి రైలు మార్గంలో న్యూ జల్జాపురికి చేరుకోవాలి. అక్కడి నుంచి డార్జిలింగ్ 76 కిలోమీటర్ల దూరంలో చేరుకోవచ్చు.