Vastu Tips: వాస్తుకు మనం తీసుకుంటున్న జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. వాస్తు శాస్త్రం సూచించిన పద్ధతులు పాటిస్తే మనకు ప్రశాంతత లభిస్తుంది. నియమాలు అవలంభిస్తే ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. వాస్తు రీత్యా మనం కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటే మంచిది. దీని కోసం కొన్ని మార్గాలు అన్వేషించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గణేషుడిని ప్రతిష్టిస్తే ఇంటికి ఎలాంటి ఆపదలు రావు. ఇంట్లో ఆరోగ్యం, శాంతి, బాధల నివారణకు పలు వస్తువులు వాటిని అమర్చే విధానం కూడా తెలుసుకోవాలి. వస్తువులను సరైన దిశలో అమర్చితే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్న సంగతి విధితమే.

ఇంటికి ఆగ్నేయ భాగంలో వంట గది ఉండేలా చూసుకోవాలి. ఈశాన్య భాగంలో పూజా గది ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం. నైరుతి భాగంలో పడక గది ఉంచుకోవాలి. అన్ని వాస్తు నియమాల ప్రకారం నిర్మించుకుంటే ఇంట్లో శక్తి పెరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతుంటారు. ప్రకాశవంతమైన లేత రంగులు గోడలకు వేయించుకోవాలి. ముదురు రంగులను వాడొద్దు. దీంతో వాస్తు పద్ధతుల ప్రకారం మన ఇంటిని చక్కదిద్దుకోవాలి.
ఇల్లు నిర్మించుకునేటప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు సరిగా ఉండేలా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుండాలంటే కిటికీలు, తలుపులు సరిగా అమర్చుకోవాలి. ఇంట్లో సానుకూల శక్తి వచ్చేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో శాంతి, సామరస్యం విరియాలంటే బుద్ధుడి విగ్రహాలను ఉంచుకోవడం మంచిదే. ఇది కూడా శ్రేయస్సు కలిగిస్తుంది. బుద్ధ విగ్రహాలను సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి. దీంతో శాంతి, సంపద, సామరస్యం పెరుగుతాయి. ఇంట్లో వారి మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి.

సీలింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి గదిలో సీలింగ్ నాలుగు మూలలు ఉండేలా ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం. మూలలు ఎక్కువగా ఉంటే అనర్థమే. గదలు నిర్మించుకునే క్రమంలోనే మనం అప్రమత్తంగా ఉండి వాస్తు నియమాల ప్రకారం గదుల నిర్మాణం చేసేలా చూసుకుంటే ఇబ్బందులు ఉండవు. వాస్తు విషయంలో జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే. గదులు కూడా సరైన విధంగా లేకపోతే ప్రతికూల ప్రభావాలే ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.