Aarogyasri Scheme Telangana: ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు గాను పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పలు రకాలుగా ఇబ్బందులు పెడుతోంది. కుటుంబాలు కకావికలం అవుతున్నాయి. దీంతో వచ్చే జబ్బులతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి అండగా నిలవాలని భావిస్తోంది. రోగాలు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యం అవసరం ఏర్పడుతోంది. ప్రజలకు ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీంతోనే సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.

ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు నిర్ణయించింది. దీనికిగాను మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చర్యలు తీసుకుంటున్నారు. ఇదివరకే బస్తీ దవాఖానాల పేరుతో పట్టణాల్లో నిర్వహిస్తున్న ఆస్పత్రులతో పాటు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. ఈ నెలలో రెండు వేల పల్లె దవాఖానాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
హైదరాబాద్ నగరంలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. జిల్లాల్లో కూడా 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యం అందజేయాలని చూస్తోంది. దీనికి గాను పటిష్ట చర్యలు తీసుకుంటోంది. త్వరలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. దీంతో ఇక మీదట ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిర్ణయించింది.

ఆరోగ్యశ్రీలో ఇదివరకే వైద్యం అందుతుండగా ఇప్పుడు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు ముందుకు రావడంతో ఇక ప్రజలకు మరింత మెరుగైన రీతిలో వైద్య సేవలు అందుతాయని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఎంతటి జబ్బుకైనా వైద్యం అందించే విధంగా మార్గదర్శకాలు తయారు చేస్తోంది. భవిష్యత్ లో సమస్యలు లేని వైద్యం అందించి ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.