Vastu Tips For Home: ప్రస్తుత కాలంలో వాస్తుకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రతి వారు తమ ఇంటికి వాస్తు పద్ధతుల ప్రకారం అన్ని సమకూర్చుకుంటున్నారు. చిన్న చిన్న దోషాలున్న అవి పెద్ద నష్టాలకు దారితీస్తున్నాయి. దీంతో వాస్తు ప్రభావం అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇల్లు కొనాలన్నా, ఇంటి స్థలం కొనుగోలు చేయాలన్నా వాస్తు ప్రకారం ఉంటేనే ముందుకొస్తున్నారు. లేదంటే మానేస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లేకపోతే అనర్థాలే ఎదురవుతున్నాయి. అందుకే వాస్తు ప్రకారం తమ ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు. ఇంట్లో, ఇంటి బయట వస్తువులు వాస్తు ప్రకారమే అమర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెట్లు, మొక్కలు ఉండకూడదు. ఇవి ఉన్నట్లయితే మీకు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. పిల్లలపై ప్రభావం పడొచ్చు. ఆర్థిక ప్రగతి దెబ్బతింటుంది. ఇంటి మెయిన్ గేటు దగ్గర చెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవాలి. లేదంటే బాల దోషం వస్తుంది. ఫలితంగా పురోభివృద్ధి కి అవరోధంగా మారుతుంది. ఇల్లు నిర్మాణ సమయంలోనే వాస్తు ప్రకారం అన్ని పక్కాగా ఉన్నాయో లేదో చూసుకుని మరీ ముందుకు కదలాలి.
ఇంటి ప్రధాన ద్వారం ఎదుట ప్రత్యక్ష రహదారి ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఇంట్లో సామరస్య వాతావరణం ఏర్పడదు. గొడవలు, విభేదాలతో ఇంటి సభ్యుల మధ్య ప్రశాంత వాతావరణం దెబ్బ తినే అవకాశం ఉంది. ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. వాస్తు దోషం వల్ల మీ ఇంటికి అన్ని సమస్యలు చుట్టుముడతాయి. ఆర్థిక పరమైన నష్టాలు కూడా వస్తాయి. ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు వాస్తు శాస్త్రం దృష్ట్యా ఉన్న దోషాలను సవరించుకోవాలి.

ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉండకుండా చూసుకోవాలి. సహజంగా మహిళలు ఇంట్లోని చెత్తను ఊడ్చి తలుపుల వెనుక ఉన్న చెత్త డబ్బాలో వేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. దీంతో మీకు అనేక చిక్కులు వస్తాయి. చెత్త, చెత్త డబ్బాలను ప్రధాన ద్వారం వద్ద ఉంచుకోకూడదని తెలుసుకోవాలి. వాస్తు నియమాలు పాటిస్తేనే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటిస్తూ ఇంటిని మనకు అనుకూలంగా మార్చుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది.