Vastu Tips: మనం వాస్తును నమ్ముతుంటాం. ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉండాలని చూసుకుంటారు. ఇంటి నిర్మాణం మొత్తం వాస్తు పద్ధతుల్లో ఉండాలని నిర్మిస్తుంటాం. పక్కా వాస్తు ప్రకారం ఉండకపోతే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుందని భావిస్తుంటారు. అందుకే వాస్తు పద్ధతులు పాటించడానికి ఇష్టపడతాం. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉండే వస్తువులపై కూడా దృష్టి పెడతాం. ఇంట్లో పాడై పోయిన వస్తువులు ఉంటే వాటిని బయట పడేయాలని చెబుతున్నారు.
పాత వార్తా పత్రికలు
కొందరు ఇంట్లో పాత వార్తా పత్రికలు ఉంచుకుంటారు. దీంతో ఇవి ఇంట్లో గుట్టలుగా పేరుకుపోతాయి. వీటితో దుమ్ము, ధూళి చేరడమే కాకుండా కీటకాలు సైతం వస్తుంటాయి. అందుకే పాత వార్తా పత్రికలు ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు. వీలైనంత వరకు వాటిని ఇంట్లో నుంచి బయట పడేయడానికే మొగ్గు చూపాల్సి ఉంటుంది. దీన్ని అందరు గమనించుకోవాలి.
పనికి రాని తాళాలు
ఇంట్లో పనికి రాని పాడైపోయిన తాళాలు ఉంటే బయట పడేయాలి. ఉపయోగం లేని వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. వీటిని ఉంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం రాకుండా పోతుంది. మన అభివృద్ధి కుంటుపడుతుంది. ఇంట్లో పాత తాళాలు ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచుకోవడమే మంచిది.
గడియారాలు
ఇంట్లో పాడై పోయిన గడియారాలు ఉంటే వాటిని దూరంగా పారేయాలి. వాటి వల్ల కూడా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. పనిచేయని గడియారాలను ఇంట్లో ఉంచుకోకూడదు. మనకు సమయం సూచిస్తాయి. కాబట్టి అవి పనిచేయకపోతే దూరంగా పెట్టడమే మంచిది. లేదంటే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. పాత, పనిచేయని గడియారాలు ఉంటే వాటిని బయట పడేయడమే మేలు.
పాదరక్షలు
మనం వాడని చెప్పులు ఇంట్లో ఉంచుకోకూడదు. వాటిని బయట పడేయాలి. వాడని వాటిని ఇంట్లో ఉంచుకుంటే ప్రతికూలతలు వస్తాయి. ధరించని చెప్పులు, బూట్లు ఉంటే వాటిని శనివారం బయట పడేస్తే మంచిది. వాటిని మనం ఇంట్లో ఉంచుకోవడం వల్ల కష్టాలు రావడం సహజం. అందుకే వాటిని దూరంగా ఉంచడమే శ్రేయస్కరంగా చెబుతారు.
పాత బట్టలు
మనం వేసుకోని పాత బట్టలు కూడా ఇంట్లో ఉంచుకోవద్దు. ఇవి మన కెరీర్ ను అడ్డుకుంటాయి. మనకు నష్టాలు కలిగిస్తాయి. మనం ఎటైనా ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు చిరిగిన బట్టలు ధరిస్తే విఘ్నాలు ఏర్పడవచ్చు. వాడని పాత బట్టలు ఇంట్లో ఉంచుకోవద్దు. ఇలా చేయడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ఇలా మనం ఇంట్లో పాత వాటిని ఉంచుకోవడం వల్ల నష్టాలే కలుగుతాయి. అందుకే వాటిని బయట పడేయడం మంచిది.