Vastu Tips Toilet: మనం వాస్తుకు ప్రాధాన్యం ఇస్తుంటాం. ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారం అమర్చుకుంటాం. ఇక బాత్ రూం విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రతికూల శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల మన జీవితమే తలకిందులవుతుంది. అందుకే వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటించేందుకు మొగ్గు చూపుతాం. దీని వల్ల మనకు సంపద కలుగుతుంది. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది.
ఇంట్లో బాత్ రూంను ఆగ్నేయ, నైరుతి దిశల్లో కట్టుకోకూడదు. ఇలా చేస్తే ఇంట్లో డబ్బు నిలవదు. కలహాలు ఏర్పడతాయి. దక్షిణం యముడి దిశగా చెబుతుంటారు. అందుకే దక్షిణం వైపు ఏది ఉండకూడదు. బాత్ రూంలో ఎప్పుడు నీలం రంగు బకెట్, మగ్ ఉంచుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి కుబేరుడు వస్తాడని నమ్ముతుంటారు.
బాత్ రూంలో ఎప్పుడు కూడా అద్దం పెట్టుకోకూడదు. అద్దం శక్తిని కలిగిస్తుంది. బాత్ రూంలో నెగెటివ్ శక్తి ఉంటుంది. అందుకే అక్కడ అద్దం పెట్టకూడదు. అటాచ్డ్ బాత్ రూంలలో ఇప్పుడు అద్దాలు పెట్టుకుంటున్నారు. ఒకవేళ పెట్టుకుంటే ఉత్తరం లేదా తూర్పు గోడకు మాత్రమే బిగించుకోవాలి. వాస్తు ప్రకారం బాత్ రూం మెయిన్ గేటుకు ఎదురుగా లేదా వంట గది ముందు నిర్మించకూడదు.
ఇలా చేస్తే దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది. బాత్ రూం పశ్చిమ లేదా వాయువ్య దిశలో ఉంటే మంచిది. బాత్ రూం తలుపులు మూసి ఉంచాలి. బాత్ రూం తలుపులు ఉత్తరం వైపు ఉండాలి. మెట్ల కింద టాయిలెట్ అసలు నిర్మించకూడదు. ఈశాన్యం లేదా తూర్పు వైపు బాత్ రూం తలుపులు ఉంచకూడదు. ఇలా వాస్తు శాస్ర్తంలో బాత్ రూం గురించి ఎన్నో నిబంధనలు ఉన్నాయి.