Chanakya Niti Married Life: చాణక్య నీతి: దంపతుల్లో సంతోషకరమైన జీవితం కోసం చాణక్యుడు సూచించిన మార్గాలు

ఒకరిపై మరొకరికి విశ్వాసం ఉండాలి. ప్రేమకు నమ్మకమే పునాది అనుమానం సమాధి అన్నట్లు భార్యాభర్తల్లో నమ్మకమనే బంధంతోనే కలిసి ఉంటారు. అది దూరమైన నాడు ఇద్దరి మధ్య అనుబంధం తెగిపోతుంది. ఇద్దరు వారి నమ్మకాలను కాపాడుకోవాలి. జీవిత భాగస్వామికి నమ్మకద్రోహం చేస్తే కాపురం కూలిపోవడం ఖాయం. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

Written By: Srinivas, Updated On : June 15, 2023 10:47 am
Follow us on

Chanakya Niti Married Life: మనం జీవితంలో సంతోషంగా జీవించాలంటే ఏం చేయాలనే దానిపై ఆచార్య చాణక్యుడు వివరించాడు. చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం అనుసరిస్తే మనకు కష్టాలు కూడా రావు. భార్యాభర్తల్లో ఎలాంటి బాధలు రాకుండా ఉండాలంటే మనం కొన్ని పద్ధతులు పాటించాలి. లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. వీటి బారి నుంచి రక్షించుకోవాలంటే మనం తీసుకునే చర్యలేమిటో తెలుసుకుందాం.

భావాలు పంచుకోవడం

భార్యాభర్తలు ఒకరి ఇష్టాలు మరొకరు గౌరవించాలి. ఆలోచనలు పంచుకోవాలి. పనులు చేయడంలో ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉండాలి. జీవిత భాగస్వామి ఇష్టాలను పట్టించుకోవాలి. దంపతుల మధ్య సన్నిహిత్యం ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి. సంతోషకరమైన జీవితం అనుభవించొచ్చు.

విశ్వాసం

ఒకరిపై మరొకరికి విశ్వాసం ఉండాలి. ప్రేమకు నమ్మకమే పునాది అనుమానం సమాధి అన్నట్లు భార్యాభర్తల్లో నమ్మకమనే బంధంతోనే కలిసి ఉంటారు. అది దూరమైన నాడు ఇద్దరి మధ్య అనుబంధం తెగిపోతుంది. ఇద్దరు వారి నమ్మకాలను కాపాడుకోవాలి. జీవిత భాగస్వామికి నమ్మకద్రోహం చేస్తే కాపురం కూలిపోవడం ఖాయం. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

సహకారం

ఒకరికొకరు సహకరించుకోవాలి. పనులు పంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. రెండు ఎద్దులు జోడిగా ఉంటేనే నాగలి సాగుతుంది. భార్యాభర్తలు కూడా ఇద్దరు ప్రేమతో మెలిగితేనే సంసారం నిలుస్తుంది. ఈ నేపథ్యంలో భాగస్వాములను సంతోషపెట్టే క్రమంలో మనం చూపించే ప్రేమ మీదే మన బంధం బలపడుతుంది.