Vastu Tips: మన ఇంట్లో అన్నింటికంటే పూజ గదికి ప్రాధాన్యం ఉంటుంది. దేవుడిని కొలిచే క్రమంలో మనకు శుభాలు కలగాలని చూస్తుంటాం. అందుకే పూజ గది వాస్తు ప్రకారం ఉండాలని భావిస్తుంటాం. దాని కోసం అన్ని పద్ధతులు పాటించి పూజ గదిని నిర్మించుకుంటాం. వాస్తు శాస్త్రంలో పూజ గది ఎక్కడ ఉండాలి? ఏ వైపు కట్టుకుంటే ఫలితం ఉంటుంది అనే విషయాలు తెలుసుకుని మరీ నిర్మించుకుంటారు. దేవుడి గది పవిత్రమైన స్థానంగా భావించి పాజిటివ్ ఎనర్జీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పూజ గది వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలి. భగవంతుడికి పూజ చేసేటప్పుడు మనం ఏ దిశలో ఉండాలనే వాటిపై వాస్తు నిపుణులు సూచనలు చేశారు. దేవుని మందిరం సరైన దిశలో లేకుంటే మనకు ఆర్థిక పరిపుష్టి దక్కదు. నష్టాలే వస్తాయనడంలో సందేహం లేదు. పూజ గది పడమర, తూర్పు భాగాల్లో ఉంటే ప్రయోజనం. దేవుడికి ఉత్తరం వైపు తిరిగి మొక్కడం మేలు చేస్తుందని తెలుస్తోంది. ఇంట్లో శుభాలు కలగాలంటే పూజ గది ఏ దిక్కులో పడితే ఆ దిక్కులో ఉంచుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం జాగ్రత్తలు తీసుకోకుంటే అనర్థమే.
పూజ గదిలో దేవుళ్లు, దేవతల ఫొటోలు మాత్రమే ఉంచుకోవాలి. విగ్రహాలు ఉంచకూడదు. ఫొటోలు కూడా పెద్దవి కాకుండా మన చేతి బొటన వేలు కంటే కొంచెం పెద్దవిగా ఉండాలి. అంతేకాని ఎత్తుగా ఉండే చిత్రాలు ఉంచుకోకూడదు. దేవుళ్లకు నిత్యం పూజలు చేయాలి. మాంసాహారం తీసుకోకుండా శాఖాహారంతోనే చేసినవే తినాలి. ఇంల్లో ఉంచుకునే పూజ గదిని నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయి. దేవుని గదిని నిర్మించుకునేటప్పుడే వాస్తు పండితుల సూచనల మేరకు సరైన దిశలో నిర్మించుకుంటేనే ప్రయోజనం.
పూజ గదిలో చిరిగిపోయిన దేవుళ్ల చిత్రపటాలు, విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. పూజా మందిరాన్ని పవిత్రంగా ఉంచుకుంటేనే మనకు సంపదలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని పాటిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఐశ్వర్యం కలుగుతుంది. సకల శుభాలకు దేవుడే కారణమని నమ్ముతాం కాబట్టి పూజగదిని ఎలా పడితే అలా కాకుండా నియమాల ప్రకారం విధిగా పాటించి మన ఎదుగుదలకు మనం జాగ్రత్తలు తీసుకుని పూజగదిని నిర్మించుకుంటేనే మంచిదని తెలుసుకోవాలి.