
Vastu Tips : మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు పాటిస్తాం. అన్ని వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంటిలో ముఖ్యమైన భాగం పడకగది. ఇది అందరికి సేద తీరే గది మాత్రమే కాదు. మన జీవితాంతం ఇందులోనే నిద్రపోతాం. కాబట్టి దీని ఏర్పాటు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని పక్కా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు మనల్ని వేదనలకు గురిచేయడం ఖాయం. ఈ నేపథ్యంలో పడకగది ఎలా ఉండాలనే దానిపై ఓ విశ్లేషణ.
పడక గది నైరుతి దిశలో ఉండటం మంచిది. కొందరు ఈశాన్య దిశలో నిర్మించుకుంటున్నారు. ఇది కరెక్టు కాదు. ఈశాన్యంలో అసలు ఏం ఉండకూడదు. అక్కడ బరువు ఉంటే మనకు కష్టాలే. ఆగ్నేయం వైపు బెడ్ రూం ఉన్నా ఇబ్బందులే వస్తాయి. పడకగది నిర్మాణం ఎప్పుడు కూడా నైరుతి భాగంలోనే ఉంచుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరం. దీన్ని అందరు పాటించాల్సిందే.

పడకగదిలో మన బెడ్ ముందు అద్దం లాంటివి ఏర్పాటు చేయకూడదు. మనం మంచంపై పడుకుంటే అద్దంలో కనిపించడం అంత మంచిది కాదు. అలాగే బెడ్ కు ఎదురుగా టీవీ కూడా ఉండకూడదు. ఎటైనా పక్కకు ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో కలహాలు రావడం ఖాయం. పడక గది గోడలు నల్లగా ఉండకూడదు. వాటికి కలర్ వేసుకోవాలి. నల్లగా కనిపిస్తే అరిష్టమే.
పడకగదిలో దేవుని గుడి ఉంచుకోవద్దు. ఇంకా ఫౌంటేన్ వంటి చిత్రాలు ఉండకూడదు. మనకు హాయినిచ్చే వాటిని ఉంచుకోవాలి. అంతేకాని భావోద్వేగాలను పెంచేవి ఏవి కూడా పడక గదిలో ఉండకూడదు. పడకగదిలో మంచి వాతావరణం ఏర్పడాలంటే నిత్యం ధూపం వేయడం మంచిది. దీని వల్ల ఏవైనా నెగెటివ్ ఎనర్జీలు ఉంటే దూరంగా పోతాయి. ఇలా పడకగదిని మంచిగా ఉంచుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. లేకపోతే కష్టాలే మనల్ని వేధిస్తాయి.