
Virupaksha First Review: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రం ‘వీరూపాక్ష’.థ్రిల్లర్ జానర్ లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ విడుదలై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో అంచనాలు భారీగా పెంచేసింది.
ఈమధ్యనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి A సర్టిఫికేట్ ఇచ్చారు. హారర్ థ్రిల్లర్ కాబట్టి A సర్టిఫికేట్ ఇచ్చారని అంటున్నారు. సుకుమార్ స్క్రీన్ ప్లే మరియు కథ అందించగా,ఆయన శిష్యుడు కార్తీక్ దండు ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని, నిన్న ప్రసాద్ లాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖులకు వేశారు, టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము.

థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కే సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోకుండా ఉండవు.ఈ చిత్రం కూడా అలాగే ఉందట.ఊహించని ట్విస్టులతో, అద్భుతమైన టేకింగ్ తో డైరెక్టర్ కార్తీక్ దండు శభాష్ అనిపించాడని టాక్. ప్రారంభం నుండి చివరి వరకు సినిమాని తర్వాత ఏమి జరగబోతుంది అనే ఉత్కంఠ కలిగించడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కేవలం తెలుగులో మాత్రమే కాదు, ఈ సినిమా హిందీ లో కూడా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అక్కడ ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేస్తాయి అనే విషయం తెలిసిందే. కార్తికేయ 2 బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఎలా అయితే ఒక ఊపు ఊపిందో,ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఇదే రేంజ్ టాక్ విడుదల తర్వాత కూడా వస్తుందా లేదా అనేది.