Chanakya Neeti : అపర చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలు జీవితాన్నే మార్చేస్తాయి. మౌర్య సామ్రాజ్యంలో ఈయన బోధనలు ఎంతో ఉపయోగపడ్డాయి. అయితే కేవలం రాజ్యానికి సంబంధించిన విషయాలే కాకుండా జీవితానికి అవసరం అయ్యే అనేక విలువైన సూత్రాలను అందించారు. వీటిని ఆనాటి నుంచి నేటి వరకు పాటిస్తూ వస్తున్నారు. ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధి సాధించాలంటే నిజాయితీగా కష్టపడాలని చెబుతాడు. ఇదే సమయంలో కాస్త తెలివిగా ప్రవర్తించాలని అంటారు. ఆయన చెప్పిన ప్రకారం.. జీవితంలో ఉద్యోగం, వ్యాపారం మాత్రమే కాకుండా మన చుట్టు పక్కల వాళ్లను కూడా నమ్మాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే నేటి కాలంలో చాలా మంది ఏదో రకంగా మోసం చేస్తున్నారు. దగ్గరి వాళ్లే ఇలాంటి పనులు చేయడం వల్ల ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మొద్దో తెలియడం లేదు. దీంతో కొన్ని సూత్రాల ఆధారంగా ఒక వ్యక్తి గురించి అంచనా వేయొచ్చు. వాటి ఆధారంగా ఆ వ్యక్తితో కలిసి ఉండాలా? లేదా? అనేది తెలుసుకోవచ్చని చాణక్యుడు చెప్పారు. మరి ఆ సూత్రాలు ఏవంటే?
ప్రతి మనిషికి డబ్బు తప్పనిసరి. ఇది లేకుంటే జీవితం ముందుకు సాగదు. అయితే అందరి వద్ద అన్ని సమయాల్లో డబ్బు ఉండకపోవచ్చు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో చేతిలో మనీ లేకపోతే ఇతరుల వద్ద అప్పుగా తీసుకుంటారు. ఒక వ్యక్తికి అప్పు ఇచ్చే సమయంలో అత్యవసరం అయితే తప్పనిసరిగా ఇవ్వొచ్చు. లేక అప్పు తీసుకున్న వ్యక్తి దుబారాగా ఖర్చు చేస్తున్నారా? అనేది గమనించాలి. ఈ క్రమంలో ఒక వ్యక్తికి కొత్తగా అప్పు ఇచ్చేటప్పుడు కొంత మొత్తం ఇవ్వాలి. దానిని అతను సకాలంలో తీరుస్తున్నారా? లేదా చూడాలి. అప్పుడే ఆ వ్యక్తిని నమ్మాలి.
ఒక వ్యక్తిని నమ్మే ముందు అతడు ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసుకోండి. కళ్ల ముందు మంచి పనులు చేసి తెర వెనుక చెడు పనులు చేసేవారు ఎక్కవగా ఉంటారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి గురించి చాలా తొందరగా తెలుసుకుంటే మీకు ఆ వ్యక్తి తో నష్టం లేనట్లే. అలా కాకుండా అతడిని ఏ కోణంలో చూసినా మంచి వ్యక్తి అని నిర్దారణకు వస్తే అతనితో కలిసి ఉండడానికి ముందుకు వెళ్లొచ్చు.
కొందరు తమ కోసం కాకుండా ఇతరుల కోసం అన్నట్లుగా ఉంటారు. ఇలాంటి వారు త్యాగాలు చేయడానికైనా వెనుకాడరు. మీకు ఆ వ్యక్తి ఆపద సమయంలో ఆదుకుంటే ఆ వ్యక్తినిపూర్తిగా నమ్మొచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తి మీకోసం మాత్రమే త్యాగం చేశారా? లేదా ఇతరులకు సేవ చేస్తున్నారా? అనేది తెలుసుకోవాలి. అప్పుడే పూర్తిగా నిర్దారణకు వస్తే మంచిది.
ప్రతీ వ్యక్తి జీవితం రెండు కోణాల్లో ఉంటుంది. ఒకటి మంచి లక్షణం. మరొకటి చెడు లక్షణం. మీరు ఒక వ్యక్తిని నమ్మాలనుకుంటే అతను ఎలా మాట్లాడుతున్నారో గ్రహించాలి. అతను అబద్దం చెప్పే వ్యక్తి అయితే అతనికి దూరంగా ఉండడమే మంచిది. అలాగే వాస్తవాలు మాట్లాడుతూ సన్మార్గంలో పయనించే వారు అయితే అతనితో సంతోషంగా ఉండగలుగుతారు.