Telugu News » Odd News » Do you know what will happen if there are no crows on earth
Crows : కాకులు అంతరిస్తే.. ఈ ప్రపంచం ఏమవుతుంది.. సంచలన నిజాలివీ
ఎక్కడైన చెట్టు ఉంటే దానిపై కాకులు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. అందుకు కారణంగా పర్యావరణం కాలుష్యంగ కావడమేనని కొందరు అంటున్నారు. అయితే కాకులను కేవలం పక్షులను కాకుండానే దైవంగా భావిస్తున్నారు. హిందూ శాస్త్రం ప్రకారం కాకికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే రానున్న రోజుల్లో కాకి లేకపోతే ఏమవుతుందో తెలుసా?
Crows : భారతదేశంలో సహజ వనరులు ఎక్కువ. దీంతో ఇక్కడ మనుషులతో పాటు జంతువులు, పక్షులు ఎక్కువగా నివసిస్తుంటాయి. అయితే నేటి కాలంలో పట్టణీకరణ పేరుతో అడవులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో జంతువులు, పక్షులు కనుమరుగవుతున్నాయి. ముఖ్యంగా చెట్లు ఎక్కువగా కనిపించకపోవడంతో అరుదైన జాతులు మాయమవుతున్నాయి.భారత్ లోని కొన్ని ప్రదేశాల్లో ఒకప్పుడు కాకులు విచ్చలవిడిగా కనిపించేవి. ఎక్కడైన చెట్టు ఉంటే దానిపై కాకులు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. అందుకు కారణంగా పర్యావరణం కాలుష్యంగ కావడమేనని కొందరు అంటున్నారు. అయితే కాకులను కేవలం పక్షులను కాకుండానే దైవంగా భావిస్తున్నారు. హిందూ శాస్త్రం ప్రకారం కాకికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే రానున్న రోజుల్లో కాకి లేకపోతే ఏమవుతుందో తెలుసా?
ఒకప్పుడు కాకికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఇంటి ముందు కాకి అరిస్తే ఎవరో చుట్టాలు వస్తారని భావించేవారు. అలాగే అనుకోకుండా కాకి అటూ ఇటూ తిరిగితే ఏదో చెడు సంకేతం అని భావిస్తారు. కాకి మనుషుల నెత్తిపై దాడి చేస్తే ఏదో కీడు జరుగుతుందని అనుకుంటారు. మరీ ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే వారికి పిండ ప్రదానాలు చేసే సమయంలో కాకి ముట్టడం వల్ల తమ పెద్దలు కాకి రూపంలో వచ్చారని భావిస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కాకులు నేడు కనిపించకుండా పోతున్నాయి. ఇంటి ముందు కాకి వస్తే కొందరు వెళ్లగొడతారు. కానీ అలా చేయొద్దని కొందరు ఆధ్యాత్మిక వాదులు అంటున్నారు.
పర్యావరణ సమతుల్యం కాపాడడం వల్లే కాకుల మనుగడ సాధ్యం అవుతుందని కొందరు అంటున్నారు. చాలా మంది చెట్లను పెంచడం కంటే నరికివేతనే ఎక్కువగా చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఖాళీ ప్రదేశంలో చెట్లను పెంచాలని అంటున్నారు. అంతేకాకుండా పక్షులు ఆవాసం నెలకొల్పేలా కొన్ని ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు.పక్షులు వేసవి కాలంలో దాహం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వాటి కోసం నీటి ఏర్పాట్లు లేదా పప్పుు దినుసులు వంటివి ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల కాకుల మనుగడ ఉంటుందని అంటున్నారు.
కాకి మనిషి జీవితంలో ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందో కొన్ని సినిమాల ద్వారా చెప్పారు. బలగం, విరూపాక్ష వంటి సినిమాల్లో కాకి ప్రాధాన్యం గురించి చెప్పారు. అంతేకాకుండా కొందరు పిండ ప్రధాన సమయాల్లో కాకి ముట్టే వరకు ఆగుతున్నారు. ఇందు కోసం కొందరు ప్రత్యేకంగా కాకులను పెంచుతున్నారు. అయితే కాకులు మాత్రమే కాకుండా పిచ్చుకలు, ఇతర పక్షుల మనుగడకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీటి వల్ల చిన్న చిన్న క్రిముల నుంచి దూరంగా ఉంటామని అంటున్నారు.
ముఖ్యంగా రైతులు తమ పంట పొలాల్లో కొన్ని చీడ పురుగులను కొన్ని పక్షులు తింటూ ఉంటాయి. అందువల్ల వీటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. పక్షుల వల్ల మనుషులకు మేలు జరగడమే గానీ.. ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారు. అయతే కొందరు పక్షి ప్రేమికులు వీటి మనుగడ కోసం చర్యలు తీసుకుంటున్నారు. కనీసం వీరికి సాయం అయినా చేయాలని కొందరు కోరుతున్నారు.