Homeలైఫ్ స్టైల్Instagram: ఇన్ స్టా గ్రామ్ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే

Instagram: ఇన్ స్టా గ్రామ్ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే

Instagram: ఇన్ స్టాగ్రామ్.. ఫేస్బుక్, వాట్సప్ తర్వాత ప్రపంచంలో అత్యధిక మంది వాడుతున్న సోషల్ మీడియా యాప్. ఈ యాప్ నిర్వహణను మెటా కంపెనీ చేపడుతోంది. మెటా బగ్ టీమ్ ద్వారా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆప్షన్లు జోడిస్తుంది. కానీ ఈ యాప్ అంత సురక్షితం కాదని ఇటీవల తేలిపోయింది. మీడియా ఐడి సహాయంతో ఎటువంటి పాస్వర్డ్ లేకుండానే ఇతరుల రీల్స్ లోకి వెళ్లి థంబ్ నెయిల్ మార్చవచ్చని ఒక కుర్రాడు నిరూపించాడు. ఇందులో ఉన్న ఓ బగ్ వల్లే ఇదంతా జరుగుతోందని ఆధారాలతో సహా వివరించాడు. దీంతో మెటా కంపెనీ వాళ్లకు దిమ్మతిరిగినంత పని అయింది.

Instagram
Instagram

ఇంతకీ ఏంటి ఆ సమస్య

ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీ మీదనే నడుస్తోంది. 4 జి దాటి 5 జి స్థాయికి స్మార్ట్ ఫోన్లు ఎదిగాయి. కొత్త కొత్త యాప్స్ మనిషి జీవితాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అయితే వీటిలో మంచి ఉన్నట్టే చెడు కూడా పొంచి ఉంది. ఈ యాప్స్ ద్వారా అక్రమ మార్గంలో ఆదాయానికి అలవాటు పడ్డ కొంతమంది ఈ సోషల్ మీడియా యాప్స్ లో బగ్స్ ను పంపిస్తున్నారు.

Also Read: Renuka Chowdhury- Kodali Nani: గుడివాడ బరిలో రేణుకా చౌదరి…ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్న కొడాలి నాని

ఇవి ఖాతాలు నిర్వహిస్తున్న వారికి తెలియకుండానే చేయ కూడని పనులు చేస్తుంటాయి. దీనివల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లడమే కాకుండా, గోప్యంగా ఉండాల్సిన వివరాలు ఇతరుల చేతికి చిక్కుతాయి. ఈ బగ్ ఉందనే విషయాన్ని రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కు చెందిన నీరజ్ శర్మ అనే యువకుడు గుర్తించాడు. ఇందుకు సంబంధించి ఫేస్బుక్ యాజమాన్యానికి రిపోర్ట్ కొట్టాడు. దీంతో వారి స్పందించి ఎలా నిరూపించగలరో మా వద్దకు వచ్చి ఒకసారి చూపించండి అని అడిగారు. దీంతో నీరజ్ శర్మ మెటా కంపెనీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కు ఒక డెమో పంపాడు. దీంతో వారు యాప్ ను క్షుణ్ణంగా పరీక్షించి బగ్ ఉందని నమ్మారు. తర్వాత నీరజ్ శర్మకు 35 లక్షల రివార్డు అందజేశారు. రివార్డు అందజేయడంలో ఆలస్యం కావడంతో పరిహారంగా మరో 3.5 లక్షలు పంపారు.

Instagram
Instagram

ఈ బగ్ ద్వారా ఏమవుతుందంటే..

ఇన్ స్టాగ్రామ్ లో ఈ బగ్ ఉండటం వల్ల ఎవరి ఐడీ ల్లో రీల్ కు సంబంధించి థంబ్ నెయిల్ మార్చవచ్చు. పాస్వర్డ్ ఎంత బలంగా ఉన్నా.. కేవలం మీడియా ఐడి ద్వారా ఈ పని చేయవచ్చు. గత ఏడాది డిసెంబర్లో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను నీరజ్ శర్మ తనిఖీ చేస్తుండగా తన రీల్ థంబ్ నెయిల్ ఎవరో మార్చినట్టు గుర్తించాడు. దానిని పూర్తిగా తనిఖీ చేయగా ఓ బగ్ ఉందని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని జనవరి మూడో తేదీన ఫేస్బుక్ యాజమాన్యానికి రిపోర్ట్ కొట్టి తెలిపాడు. స్పందించిన ఫేస్ బుక్ యాజమాన్యం డెమో ద్వారా ఈ వివరాలు తెలియజేయాలంటూ అతడికి వర్తమానం పంపింది. దీంతో ఐదు నిమిషాల డెమో ద్వారా ఆ బగ్ కు సంబంధించిన వీడియోను శర్మ పంపాడు. దీంతో ఫేస్బుక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు యాప్ ను మరింత పటిష్టంగా తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఇన్స్టాగ్రామ్ ను ఆపరేట్ చేస్తున్న మెటా కంపెనీ తన యాప్ ల భద్రత కోసం మెటా బగ్ టీం పేరుతో కొంతమంది ఇంజనీర్లను నియమించింది. యాప్ లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించేందుకు వారికి పరీక్ష పెడుతుంది. అందులో నెగ్గిన వారికి లక్షల్లో రివార్డులు ఇస్తుంది. అయితే ఆ స్థాయిలో ఇంజనీర్లు ఉన్నప్పటికీ ఇన్ స్టాగ్రామ్ లో బగ్ ను గుర్తించలేకపోవడం గమనార్హం.

Also Read:Godfather New Song: చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి చేస్తే బీభత్సమే ఇక.. అభిమానులు ఈ రోజు ఆగలేరంతే!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular