spot_img
Homeలైఫ్ స్టైల్ Grow Strong Hair : జుట్టు బలంగా పెరగాలంటే.. దీన్ని తప్పకుండా వాడాల్సిందే!

 Grow Strong Hair : జుట్టు బలంగా పెరగాలంటే.. దీన్ని తప్పకుండా వాడాల్సిందే!

Grow Strong Hair : అమ్మాయిలకు అందాన్నిచ్చే వాటిలో జుట్టు చాలా ముఖ్యమైనది. కురులు అందంగా ఉంటేనే మహిళలు అంత కంటే ఎక్కువ అందంగా కనిపిస్తారు. అయితే కాలుష్యం, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన వల్ల చాలా మంది జుట్టు ఈ రోజుల్లో రాలిపోతుంది. వీటికి ముఖ్య కారణం మనం తినే ఫుడ్, రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్, షాంపూ, ఆయిల్స్ వంటివి కారణం అవుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలని కొందరు ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. అయిన కూడా జుట్టు రాలిపోయే సమస్య మాత్రం తగ్గకుండా ఇంకా పెరుగుతుంది. ఇంతకు ముందు జనరేషన్‌లో ఒక్కోరి జుట్టు పొడవుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరి జుట్టు చూస్తున్న కూడా చిన్నగానే ఉంటుంది. అందులో జుట్టు ఇంకా రాలిపోవడం ఒకటి. జుట్టు ఆరోగ్యంగా ఉంటూ బలంగా పెరగాలంటే కేవలం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే సరిపోదు. వీటిని వాడటం వల్ల జుట్టు పెరగడం ఏమో కానీ ఇంకా రాలిపోతుంది. ఈ విషయం తెలియక చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టి మరి జుట్టు రాలే సమస్యను ఇంకా పెంచుకుంటున్నారు. జుట్టు ఒత్తుగా పెరగాలంటే వాడే ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా కొన్ని సహజ చిట్కాలు పాటించాలి. జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో మరి ఈ స్టోరీలో చూద్దాం.

జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వెదురు సారం బాగా ఉపయోగపడుతుంది. వెదురు సారం వాడటం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. ఇందులోని పోషకాలు జుట్టు పెరుగుదలకు సాయపడతాయి. ఈ వెదురులో ఉండే విటమిన్లు జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా చేస్తు్ంది. ఇందులో సహజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వెదురులోని కాండం, ఆకుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టును కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా చేయడంతో పాటు జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. కొందరు ఎక్కువగా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వెదురు సారాన్ని వాడవచ్చు. దీన్ని వాడటం వల్ల జుట్టు కూడా పగుళ్లు పడకుండా ఉంటుంది. కొత్తగా జుట్టు మళ్లీ పెరిగేలా చేస్తుంది. వెదురులో సారంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును దెబ్బతినకుండా కాపాడుతాయి. ఫ్రీ రాడికల్స్‌ను కూడా దెబ్బతీస్తాయి. దీంతో జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

వెదురు సారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వెదురు సారంతో జుట్టుని కడిగితే పగుళ్లు లేకుండా ఉంటుంది. దీన్ని జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేస్తు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే దీన్ని ఆయిల్‌గా కూడా తయరు చేసుకోవచ్చు. తలస్నానం చేసిన తర్వాత వెదురు సారాన్ని కొబ్బరి నూనె లేదా అవకాడో నూనె లేదా మీరు ఉపయోగించే నూనెలో కలిపి జుట్టుకు కుదుళ్ల నుంచి పట్టించాలి. ఆ తర్వాత మళ్లీ తలస్నానం చేయాలి. రెండుసార్లు వారానికి ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వెదురు సారం జుట్టుకు కండిషనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఈ వెదురు సారంలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ కలిపి కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు. అయితే చర్మ సమస్యలు ఉన్నవారు ఈ వెదురు సారం ఉపయోగించకపోవడం మేలు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper