Women’s Day 2022: మహిళలు ఇప్పుడు అన్నింటిలోనూ రాణిస్తున్నారు. సమాజంలో ఎంతో కాలంగా పాతుకుపోయిన కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకుంటున్న మహిళలు.. ఇప్పుడు స్వాతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. వారికి నచ్చిన పని చేస్తు్న్నారు. ఆడవాళ్లు అంటే వంటింటి కుందేళ్లు కాదని, పిల్లలు కనడం ఒకటే వారికి వచ్చనే భ్రమను తొలగించేస్తున్నారు.

తాజాగా జరిగిన ఓ ఘటన మహిళలు ధైర్యసాహసాలకు ప్రతీకలు అనే విషయాన్ని వెల్లడిస్తోంది. మినీ బస్సులో సరదాగా విహార యాత్రకు వెళుతున్న సమయంలో.. ఉన్నట్టుండి మినీ బస్ ను నడుపుతున్న బస్ డ్రైవర్ స్పృహతప్పి పడిపోయాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. డ్రైవర్ కి ఏమైందో తెలియదు, తమ పరిస్థితి ఏంటో అర్థం కాని అనిశ్చితి ఏర్పడింది. అప్పుడే ఓ మహిల ధైర్యంగా ముందుకు వచ్చి.. స్టీరింగ్ పట్టి బస్ ని నడిపి డ్రైవర్ ప్రాణాలను కాపాడటంతో పాటు, అక్కడున్న వారి భయాలను పటాపంచలు చేసింది.
20 మంది ఆడవాళ్లు సరదాగా పిక్ నిక్ వెళదామని.. ఓ మినీ బస్ ను అద్దెకు తీసుకున్నారు. అంతా సర్దుకొని వారు బస్ ఎక్కి ప్రయాణమయ్యారు. అలా ప్రయాణం మొదలవగా.. కాసేపటికి డ్రైవర్ స్పృహతప్పి పడిపోయాడు. ఉన్నట్టుండి ఇదంతా జరగడం చూసిన బస్ లోని మహిళలు భయపడ్డారు. కానీ 42 సంవత్సరాల యోగితా సతవ్ మాత్రం భయపడలేదు. డ్రైవర్ ను తప్పించి, అతడి సీటులో కూర్చొని స్టీరింగ్ పట్టింది. ఎలాగోలా ఆమె మహారాష్ట్రలోని పూణెకు 35కిలోమీటర్ల దూరంలోని షిక్రాపూర్ పట్టణంలోని ఓ హాస్పిటల్ వరకు బస్ ను తీసుకెళ్లింది.

సరైన సమయంలో బస్ డ్రైవర్ కు చికిత్స అందడంతో అతడి ప్రాణాలు నిలిచాయి. 42 ఏళ్ల యోగితా సతవ్.. ఇంట్లోనే ఇంటి పనులు చేసుకునే ఓ సాధారణ మహిళ. కష్టకాలంలో ఆమె చూపిన తెగువ, ధైర్యసాహసాలను అనన్యసామాన్యం. ఈ మొత్తం వ్యవహారాన్ని కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ యాడ్ రూపంలో షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టింది. యోగితా ధైర్య సాహసాలకు నెటిజర్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోకు జనాలు సెల్యూట్ చేస్తున్నారు.
[…] International Women’s Day 2022: మహిళల కోసం ఎన్నో చట్టాలు వస్తున్నాయి. వారి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ రంగంలోనైనా సరే స్త్రీలకు అవమానాలే ఎదురవుతున్నాయి. అయినా మగువలో తెగువ చూపాల్సిన సమయం ఆసన్నమైంది. […]