Punjab Election Exit Poll: దేశంలో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రానున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఆసక్తిని పెంచుతున్నాయి. అందరి దృష్టి మాత్రం పంజాబ్ పై పడింది. ఇక్కడ అతిపెద్ద పార్టీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ వెనుకంజలో పడిపోయింది. ఇక్కడ అమ్ ఆద్మీ ప్రభంజనం సృష్టించనుందని అన్ని సర్వేలు చెబుుతున్నాయి. దీంతో అందరు పంజాబ్ లో జరిగే పరిణామాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆప్ మెల్లగా తన ప్రభావాన్ని విస్తరి స్తోంది. పక్కనే ఉన్న పంజాబ్ లో అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేసి పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు సిద్ధపడినట్లు తెలుతస్తోంది.
పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు అన్ని అవాంతరాలే ఎదురయ్యాయి. ముఖ్యమంత్రుల మార్పు కష్టాల్లో పడేసిందనే చెప్పాలి. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నవజ్యోతి సింగ్ సిద్దూ పార్టీని అధో పాతాళానికి పడేశారు. ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి పార్టీని అధికారంలోకి రాకుండా చేశారు. దీంతో ఆప్ కు ప్లస్ అయింది. ఇప్పటికే దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారం ఉన్న తాజాగా పంజాబ్ దూరమైతే ఇక రెండే మిగులుతాయి. దీంతో పార్టీ దేశంలో మనుగడ సాగించడం కష్టమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాలే మిగలనున్నట్లు చెబుతున్నారు.
అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సాధారణ వ్యక్తిలాగే ఉంటూ తన ప్రభావాన్ని పంజాబ్ ఓటర్లపై చూపించారు. ఢిల్లీలో చేపట్టబోయే పథకాలను వివరిస్తూ ఇక్కడ కూడా ప్రజారంజకమైన పాలన అందిస్తామని ఓటర్లలో విశ్వాసం నెలకొల్పారు. దీంతో వారు ఆప్ కు దగ్గరయ్యారు. ఇన్నాళ్లుగా చూస్తున్న కాంగ్రెస్ పాలనకు వారు చెక్ పెట్టాలని భావించారు. అందుకే ఆప్ కే స్పష్టమైన మెజార్టీ అందించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
మరోవైపు భారతీయ జనతా పార్టీని కూడా ఓటర్లు దూరం పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ప్రభావం పార్టీపై ప్రభావం చూపిందని తెలుస్తోంది. సాగుచట్టాలు సరైనవి కాదని లక్షలాది మంది రైతులు సంవత్సరం పాటు ఉద్యమం చేయడంతో బీజేపీని ప్రజలు విశ్వసించడం లేదు. దీంతోనే పంజాబ్ లో బీజేపీకి సీట్లు రాకుండా చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా బీజేపీ ప్రజల మనసులు గెలిచే పథకాలు తీసుకొచ్చి వారికి దగ్గర కావాలని చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాని ఎవరిని లెక్కచే యకుండా ఎవరికో ప్రయోజనం చేసేలా చట్టాలు తెస్తే ఫలితం ఇలాగే ఉంటుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఏదిఏమైనా అమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో ప్రభంజనం సృష్టిస్తోందని సర్వేలన్ని వెల్లడించడం గమనార్హం.