Vastu Tips: సాధారణంగా హిందూ మతం ప్రకారం తులసి మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక ఇంటి ఆవరణలో తులసి మొక్క మనకు కనబడుతుంది. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే తులసి మొక్క విషయంలో ప్రతి ఒక్కరు కూడా పలు నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అయితే మన ఇంటి ఆవరణంలో తులసి మొక్కను సరైన దిశలో పెట్టినప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే సుఖసంతోషాలు ఉంటాయి. మరి తులసి మొక్క ఏ దిశలో ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క తూర్పు దిశలో నాటడం వల్ల ఆ ఇంట్లో అన్ని శుభఫలితాలే కలుగుతాయని చెబుతారు. ఒకవేళ తూర్పు దిశలో అనువైన స్థలం లేకపోతే ఉత్తరం ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటడం ఎంతో మంచిది.ఈ దశలో తులసి మొక్కలు నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడవు. ఈ విధంగా తులసి మొక్కను సరైన దిశలో నాటినప్పుడే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
Also Read: AP Liquor Policy: మద్యం వ్యాపారమే ఏపీ సర్కారుకు ఇంధనమా?
ఒకవేళ తులసి మొక్కను తూర్పు ఉత్తర ఈశాన్య దిశలో కాకుండా దక్షిణ దిశలో నాటడం మంచిది కాదు. ఎందుకంటే దక్షిణ దిశ పూర్వీకుల దిశగా భావిస్తారు అందుకే ఆ దిశలో తులసి మొక్కలను నాటకూడదు.ఈ దిశలో నాటడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. అలాగే మరికొందరు తులసి మొక్కలను ఒక డబ్బాలో నాటి ఇంటి పై కప్పు పై పెట్టి పూజలు చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు.ఇక తులసి చెట్టు పక్కన ఎప్పుడు అరటి మొక్క ఉండటం మంచిది ఎందుకంటే అరటి విష్ణు స్వరూపంగా భావిస్తారు. అంతేకానీ తులసి మొక్క పక్కన ముళ్ళు కలిగిన మొక్కలు ఉంచడం మంచిది కాదు. తులసి విషయంలో ఈ విధమైనటువంటి నియమాలు పాటించడం వల్ల అన్ని శుభ పరిణామాలు కలుగుతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
Also Read: SS Rajamouli RRR Movie: ఆ సీన్లతో అందరి నోళ్లు మూయించిన రాజమౌళి.. నువ్వు తోపు సామీ..