AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల పాలనపై జగన్ దృష్టి పెడుతున్నారు. ఉగాది తర్వాత కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాల్లో చాలా సమస్యలు, డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. అసలే ఏపీ అప్పుల్లో కూరుకుపోయి ఉంది. కాబట్టి అక్కడి నుంచి వస్తున్న డిమాండ్లు ఇప్పుడు జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. మొదటి నుంచి జిల్లాల పేర్లు జగన్‌కు ఇబ్బంది కరంగా ఉన్న విషయం తెలిసిందే.
కానీ ఇప్పుడు కొత్త జిల్లాల్లో ఏమేం ఉండాలో, ఏమేం కావాలో.. ఇలా అనేక విషయాలపై ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గరి నుంచి జగన్‌కువ వినతులు వస్తున్నాయి. అయితే వీటన్నింటిపై జగన్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్ల మార్పులు, పైగా జిల్లా కేంద్రాలు దూరంగా ఉండటంతో.. పాటు పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే.. పాత జిల్లా కేంద్రాలు తమ కొత్త జిల్లాల పరిధిలో లేకపోవడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు.
Also Read: BJP vs TRS: కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ ‘తీర్మానాల’ పోరు.. ఫలిస్తుందా?
పైగా కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఇతర ఆఫీసర్ల బిల్డింగులు కట్టడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇవన్నీ ఇప్పుడు జగన్ ముందుకు వస్తున్న పెద్ద డిమాండ్లు. ఈ నెల 31న కొత్త జిల్లాల మీద ఫైనల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ నోటిఫికేషన్ వచ్చే లోగానే కొత్త జిల్లాల మీద దాదాపు 11వేల అభ్యంతాలు వెల్లువెత్తాయి.
చాలా చోట్ల జిల్లాల విభజన అనేది ప్రాతిపదికన జరగలేదని, జాత జిల్లా కేంద్రాలు లేకపోతే ఎలాంటి డెవలప్ మెంట్ జరగదని చాలా చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఉన్నప్పుడే ఏపీ ప్రభుత్వం ఎలాంటి డెవలప్ చేయలేదు.. అలాంటిది ఇప్పుడు కొత్త జిల్లాల్లో ఎలాంటి అభివృద్ధి ఉంటుందని వాపోతున్నారు అక్కడి జనాలు. ఇదే విషయాన్ని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు.
కొన్ని చోట్ల పాత జిల్లాల నుంచి ఇతా జిల్లాల మండలాలను కలుపుతూ జిల్లాలుగా విభజించడం కూడా వివాదాలను రాజేస్తోంది. హిందూపురం నుంచి మొదలు పెడితే.. రాజంపేట, నర్సాపురం జిల్లా కేంద్రాల వివాదం రాజుకుంటోంది. ఇక కొన్ని జిల్లాలకు పేర్ల వివాదం ఉంది. ఇందులో చూసుకుంటే తిరుపతికి శ్రీబాలాజీ పేరు పెట్టడంతో పాటు.. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఇంకా వివాదంలోనే ఉంది.
ఇక రంపచోడవరం, మదనపల్లిలను కొత్త జిల్లాలుగా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. మరి నాలుగు రోజుల్లో ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తున్న జగన్.. వీటన్నింటినీ పెండింగ్‌లోనే పెట్టి నోటిఫికేసన్ ఇస్తారా.. లేదంటే వాటికి ఏమైనా పరిష్కారాలు చూపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మిగిలింది నాలుగు రోజులే కాబట్టి.. ఇన్ని సమస్యలను పరిష్కరించడం మాత్రం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. మరి వీటిని ఇలాగే పెండింగ్ లో పెట్టి నోటిఫికేషన్ ఇస్తే మాత్రం.. నిరసనలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: Ukraine Crisis: 300 మంది బలి: రష్యా పంతం.. ఉక్రెయిన్ పట్టుదల.. మధ్యలో ప్రజలే సమిధలు!