https://oktelugu.com/

Nagendra Babu: అది న్యూసెన్స్ సైట్‌.. ఫేమ‌స్ వెబ్ సైట్ మీద నాగ‌బాబు ఆగ్ర‌హం.. ఏమైందంటే..?

Nagendra Babu: నాలుగేళ్లుగా సినీ జ‌నాలు ఎంతో ఆతృత‌గా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. జ‌క్క‌న్న చెక్కిన అద్భుత ప్ర‌పంచాన్ని చూసేంద‌కు నార్త్ నుంచి సౌత్ వ‌ర‌కు అంద‌రూ థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు. అస‌లే ఎన్నో ఏండ్ల త‌ర్వాత పైగా టాలీవుడ్‌లో పెద్ద కుటుంబాలు అయిన మెగా, నంద‌మూరి కుటుంబాల నుంచి రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టించారు. దీంతో ఈ ఇద్ద‌రినీ జ‌క్క‌న్న ఎలా బ్యాల‌న్స్ చేశాడు.. ఎలా ఇద్ద‌రి ఫ్యాన్స్‌ను […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 26, 2022 / 09:10 AM IST
    Follow us on

    Nagendra Babu: నాలుగేళ్లుగా సినీ జ‌నాలు ఎంతో ఆతృత‌గా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. జ‌క్క‌న్న చెక్కిన అద్భుత ప్ర‌పంచాన్ని చూసేంద‌కు నార్త్ నుంచి సౌత్ వ‌ర‌కు అంద‌రూ థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు. అస‌లే ఎన్నో ఏండ్ల త‌ర్వాత పైగా టాలీవుడ్‌లో పెద్ద కుటుంబాలు అయిన మెగా, నంద‌మూరి కుటుంబాల నుంచి రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టించారు.

    Nagendra Babu

    దీంతో ఈ ఇద్ద‌రినీ జ‌క్క‌న్న ఎలా బ్యాల‌న్స్ చేశాడు.. ఎలా ఇద్ద‌రి ఫ్యాన్స్‌ను మెప్పించాడు అనేది చూసేందుకు అంద‌రూ థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు. సామాన్య జ‌నాలే కాకుండా.. సినీ సెల్ర‌బిటీలు కూడా థియేట‌ర్ల‌కు వెళ్లి టాలీవుడ్ స‌త్తాను చాటే మూవీని చూశారు. చూసిన వారంద‌రూ చెప్పింది ఒక్క‌టే.. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్‌.. నెక్ట్స్ లెవ‌ల్.. తార‌క్‌, చ‌ర‌ణ్ న‌ట విశ్వ‌రూపం చూపించారు.

    Also Read: Pawan Kalyan: అధ్యక్ష అనాల్సిందే.. ఆ రెండింటిపైనే పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్

    రాజ‌మౌళి మ‌రో అద్భుతాన్ని ఆవిష్క‌రించారు.. ఇద్ద‌రినీ బ్యాలెన్స్ గా చూపించారు అంటూ ఇలా నార్త్ నుంచి సౌత్ దాకా పాజిటివ్ టాక్ వినిపించింది. అన్ని భాష‌ల హీరోలు, ద‌ర్శ‌కులు కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. విమ‌ర్శ‌కులు కూడా అద్భుతం అంటూ కితాబిచ్చారు. ఎక్క‌డా నెగెటిక్ టాక్ రాలేదు. కానీ ఓ ఫేమ‌స్ వెబ్ సైట్ మాత్రం.. RRR మూవీకి నెగెటివ్ రివ్యూ ఇచ్చింది. ఈ మూవీలో రొమాన్స్ లేకపోవడం మైన‌స్ పాయింట్ అంటూ తెలిపింది.

    Nagendra Babu

    దీంతో ఆ వెబ్ సైట్ మీద దారునంగా ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. ఏసుకోవ‌డం అంటే ఆ ఏసుకోవ‌డం అనుకున్నావారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ వెబ్ సైట్ రివ్యూ మీద మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా.. ఆ వెబ్ సైట్ మీద ఆగ్ర‌హం తెలిపారు. అది న్యూస్ సైట్ కాదు.. న్యూసెన్స్ సైట్ అని ఫైర్ అయ్యారు. దీనికి ఆయ‌న ఓ మీమ్ ఫొటోను కూడా ఆడ్ చేశారు. ఆయ‌న పోస్టు ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇక మ‌రో పోస్టులో త్రిపుల్ ఆర్ టీమ్‌కు కంగ్రాట్స్ కూడా చెప్పారు.

    Also Read: KGF 2 Update: ముఖ్య అతిథిగా నిజంగానే ప్రభాస్ వస్తున్నాడా ?

    Tags