Twitter- Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశాక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో ట్విట్టర్ ఖాతా వాడకంలో ఎన్నో కష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వెబ్ పేజీ వారికి తిప్పలు తప్పడం లేదు. ఎలాన్ మస్క్ నేతృత్వంలో ట్విట్టర్ వినియోగదారులు బాధలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. మస్క్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం ట్విట్టర్ సర్వర్ డౌన్ కావడంతో యూజర్లు ఎన్నో ప్రయాసలు ఎదుర్కొన్నారు ఉదయం మూడు గంటలకు మొదలైన సమస్య ఏడు గంటలకు కూడా తీరలేదు. దీంతో వెబ్ యూజర్లు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ సామాజిక మాద్యమాల ద్వారా మస్క్ ను విమర్శించారు.

ఇటీవల ట్విట్టర్ వినియోగంలో వస్తున్న ఇబ్బందులతో యూజర్లు తెగ తిట్టుకుంటున్నారు. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ కొన్ని ఇబ్బందులు పెట్టగా అదే బాటలో వాట్సాప్ కూడా చేరుతోంది. ట్విట్టర్ కూడా రెండు గంటల పాటు పనిచేయకపోవడంతో ఆందోళన చెందారు. యూజర్ల డేటాకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. తరచుగా సామాజిక మాధ్యమాలు డౌన్ అవుతుండటంతో ఎన్నో సందేహాలు వస్తున్నాయి. సోషల్ మీడియా దిగ్గజాలు ఇలా చేస్తుంటే వినియోగదారులకు తలనొప్పులు తప్పడం లేదు.
ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి సంస్కరణలు చేపట్టారు. ఉద్యోగులను తగ్గించేస్తున్నారు. ఇప్పటికే సీఈవోను మార్చారు. దీంతో ఉద్యోగుల్లో కలవరం పెరుగుతోంది. ట్విట్టర్ లో ఇప్పుడు సమూల మార్పులు చేపడుతున్నారు. బ్లూటిక్ మార్కు ఫీచర్ కోసం చార్జీలు పెంచారు. ఇకపై బ్లూ టిక్ మార్కు ఉండాలంటే నెలకు రూ. 8 డాలర్లు చెల్లించాలనే నిబంధన విధించారు. దీంతో అందరిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫీచర్ ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు.

ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాభై శాతానికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపే చర్యలకు దిగుతున్నారు. ఉద్యోగుల్లో భయం కలుగుతోంది. ట్విట్టర్ ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో ట్విట్టర్ ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ను గాడిలో పెట్టకపోతే ఇంకా ఇబ్బందులు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ తీరుతో అందరికి తిప్పలు తప్పడం లేదని ఆ సంస్థ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.