Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజే వేరు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో పవన్ కొన్నాళ్లు రాజకీయాల్లోకి వెళ్లినా.. సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో మళ్లీ ఫిల్మ్ రంగంలోకి అడుగుపెట్టాడు. అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఆయన మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులు చాల స్లో అవుతున్నాయి. ముఖ్యంగా క్రిష్ జాగర్లపూడి డైరెక్షన్లో రాబోయే ‘హరిహర వీరమల్లు’షూటింగ్ కొవిడ్ సమయంలో మొదలైనా.. ఇంకా పూర్తి చేసుకోలేదు. ఈ సినిమా తరువాత ప్రారంభమైనవి థియేటర్లోకి వచ్చాయి. తాజాగా ఈ మూవీపై పవన్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ‘వకీల్ సాబ్’ చేశారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో వెంటనే నాలుగైదు ప్రాజెక్టులకు సైన్ చేశాడు. వాస్తవానికి ‘వకీల్ సాబ్’ తరువాత ‘హరిహర వీరమల్లు’ సినిమా రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఈ సినిమా తరువాత ప్రారంభించిన ‘భీమ్లానాయక్’ థియేటర్లోకి వచ్చి సందడి చేసింది. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు ’ సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మూవీపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు.
ఈ తరుణంలో పవన్ ‘హరిహరవీరమల్లు’తో పాటు హరిశంకర్ డైరెక్షన్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే ‘హరిహరవీరమల్లు’ సినిమా ఆలస్యమైనా హరిశంకర్ సినిమా కంప్లీట్ చేద్దామనుకున్నారు. కానీ ఆ డైరెక్టర్ స్టోరీ విషయంలో తాత్సారం చేయడంతో ప్రస్తుతం పవన్ రాజకీయాలకే పరిమితం అవుతున్నాడు. దీంతో పవన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నవారికి నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికీ పవన్ సినిమా ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూనే ముందుగా ‘హరిహరవీరమల్లు’ సినిమా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమా పూర్తయిన తరువాతే మిగతా ప్రాజెక్టుల జోలికి వెళ్లాలని అనుకుంటున్నారట. మరోవైపు హరిశంకర్ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్ చేయకపోవడం ఫ్యాన్స్ కు నిరాశ తెప్పిస్తోంది. దీంతో ‘హరిహరవీరమల్లు’ సినిమా పూర్తయిన తరువాత ఎలాంటి ప్రాజెక్టులు లేకపోతే మొత్తంగా రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.