Twitter Layoffs 2022: ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు , ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ అన్నట్టే అందరి కొంప ముంచేస్తున్నాడు. చేరగానే సీఈవో, సీఎఫ్ఓ సహా ట్విట్టర్ ఉన్నతాధికారులందరినీ ఇంటికి పంపిన మస్క్ ఇప్పుడు సంస్థలోని 50శాతం మంది ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకోవడం సంచలనమైంది. అంత మంది ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తున్న ఎలన్ మస్క్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

50 శాతం మంది సిబ్బందిని తొలగించామని, కంటెంట్ నియంత్రణపై భరోసా ఇవ్వడానికే ఇలా చేస్తున్నామని ట్విట్టర్ పేర్కొంది. అయితే సగం మందిని తొలగించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యొక్క కంటెంట్ మోడరేషన్ సామర్థ్యాలు అలాగే ఉన్నాయని దిగజారవని శుక్రవారం ఒక ట్వీట్‌లో తెలిపారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత భద్రత -సమగ్రత హెడ్ యోయెల్ రోత్ చేసిన ట్వీట్ వినియోగదారులకు, ప్రకటనదారులకు భరోసా ఇవ్వడానికే చేసిందని అంటున్నారు.
తప్పుడు సమాచారం, హానికరమైన కంటెంట్ వ్యాప్తిని నిరోధించడానికి బాధ్యత వహించే ట్రస్ట్ , సేఫ్టీ టీమ్‌లోని ట్విట్టర్ ఉద్యోగులలో 15% మందిని తొలగించినట్లు ట్విటర్ తెలిపింది. కంపెనీ వ్యాప్తంగా తొలగింపులు 50% మంది ఉద్యోగులను ప్రభావితం చేశాయని, తొలగింపుల పరిమాణం ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంటున్నారు.

అమెరికా మధ్యంతర ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉన్నందున.. హానికరమైన తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం అత్యంత ప్రాధాన్యతగా ఉందని ట్విట్టర్ తెలిపింది. ” కంటెంట్ నియంత్రణకు ట్విట్టర్ బలమైన నిబద్ధత పూర్తిగా మారదు” అని ప్రకటించింది.
ఈ సందర్భంగా ఎలన్ మస్క్ మాట్లాడుతూ విద్వేశ కంటెంట్ పై ఆందోళనలను లేవనెత్తిన పౌర హక్కుల సంఘాల ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్ “ఆదాయంలో భారీ తగ్గుదలని ఎదుర్కొంది. విద్వేష కంటెంట్ ను ప్రోత్సహిస్తే ప్రకటనలు ఇవ్వమని ప్రకటన కర్తలు ప్రకటించారు. అందుకే ఎలన్ మస్క్ ఇలా ఉద్యోగులను తొలగించినట్టు అర్థమవుతోంది. ఎలన్ మస్క్ వచ్చాక జనరల్ మిల్స్ , జనరల్ మోటార్స్ వంటి ప్రధాన బ్రాండ్‌లు ట్విట్టర్‌లో ప్రకటనలను నిలిపివేసినట్లు తెలిపాయి. అందుకే మస్క్ ఇలా నష్టనివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.