Homeలైఫ్ స్టైల్Fridge on off effects: ఫ్రిజ్ తరచూ ఆఫ్ చేస్తున్నారా.. అయితే ఈ సమాచారం మీకోసమే

Fridge on off effects: ఫ్రిజ్ తరచూ ఆఫ్ చేస్తున్నారా.. అయితే ఈ సమాచారం మీకోసమే

Fridge on off effects: కొన్ని దశాబ్దాల క్రితం ఫ్రిజ్ అనేది శ్రీమంతులకు మాత్రమే పరిమితమై ఉండేది. పేద, మధ్య తరగతి వారు వంటింట్లో వస్తువులను ప్రత్యేకంగా భద్రపరచుకునేవారు. నాటి కాలంలో ఫ్రిజ్ లు లేకపోయినప్పటికీ అవి బాగుండేవి. అంతగా పాడయేవికావు. కానీ, ఇప్పుడు ప్రతి ఇంట్లో దాదాపుగా ఫ్రిజ్ లు ఉన్నాయి.. ఇందులో కూడా రకరకాల మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా.. ఖర్చు కొద్దీ ఫ్రిజ్ లో సౌకర్యాలు ఉంటున్నాయి. ఫ్రిజ్ […]

Fridge on off effects: కొన్ని దశాబ్దాల క్రితం ఫ్రిజ్ అనేది శ్రీమంతులకు మాత్రమే పరిమితమై ఉండేది. పేద, మధ్య తరగతి వారు వంటింట్లో వస్తువులను ప్రత్యేకంగా భద్రపరచుకునేవారు. నాటి కాలంలో ఫ్రిజ్ లు లేకపోయినప్పటికీ అవి బాగుండేవి. అంతగా పాడయేవికావు. కానీ, ఇప్పుడు ప్రతి ఇంట్లో దాదాపుగా ఫ్రిజ్ లు ఉన్నాయి.. ఇందులో కూడా రకరకాల మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా.. ఖర్చు కొద్దీ ఫ్రిజ్ లో సౌకర్యాలు ఉంటున్నాయి.

ఫ్రిజ్ లు వాడే క్రమంలో కొంత మంది తెలిసీ తెలియక తప్పులు చేస్తుంటారు. ఫలితంగా ఫ్రిజ్ లు పాడవుతుంటాయి. తరచూ ఫ్రిజ్ ను తరచూ ఆన్ లేదా ఆఫ్ చేస్తూ ఉంటే కంప్రెసర్ పై ఒత్తిడి పెద్దగా పెరుగుతుంది. దీనివల్ల దాని జీవితకాలం తగ్గిపోతుంది. కొంతమంది వేరే ఊర్లకు వెళ్తున్నప్పుడు ఫ్రిజ్ లను ఆఫ్ చేసి వెళ్తుంటారు. దానివల్ల కంప్రెసర్ పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల ఫ్రిజ్ పనితీరు తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అలాంటప్పుడు ఫ్రిజ్ ఆఫ్ చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

వారాలపాటు బయటకు వెళ్లినా.. ఇంకా ఏదైనా పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లినా ఫ్రిజ్ ను ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ట్రే లను శుభ్రం చేసి ఆరబెట్టాలని.. అప్పుడు దుర్వాసన రాదని నిపుణులు అంటున్నారు. అలాకాకుండా ట్రేలను అలానే ఉంచితే ఫంగస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్ లో పాలు, పండ్లు, కూరగాయలను నిల్వ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఫ్రిజ్ పనితీరు కంప్రెసర్ మీద ఆధారపడి ఉంటుంది. అది నిత్యం నడుస్తూనే ఉండాలి. ఎందుకంటే విద్యుత్ ప్రవహిస్తుంటేనే దాని పనితీరు మెరుగుపడుతూ ఉంటుంది. అలాకాకుండా నిలుపుదల చేస్తే కంప్రెసర్ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అప్పుడు నిర్దేశిత కూలింగ్ ఫ్రిజ్ లో నమోదు కాదు. ఫలితంగా కూలింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అప్పుడు విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. కంప్రెసర్ కూడా శబ్దం వస్తుంది. దీంతో నిల్వచేసిన పాలు, పండ్లు, కూరగాయలు పాడవుతుంటాయి.

ఫంగస్ చేరిపోవడం వల్ల ఇవన్నీ కూడా కుళ్లిపోతుంటాయి. అందువల్లే ఫ్రిజ్ ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేయకూడదు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే స్వల్పకాలం మాత్రమే ఈ ప్రక్రియ చేయాలి. ఆ తర్వాత యధావిధిగా దాని పనితీరును కొనసాగించాలి. ఇక కూరగాయల నిల్వ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. దుంపలను, రసాయనాలతో రూపొందించిన ద్రవ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్ లో నిల్వ చేయకూడదు. దానివల్ల ఫ్రిజ్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు అందులో రకరకాల ఫంగస్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper