Fake Turmeric: మనం రోజు తినే ఆహారంలో పసుపు తప్పనిసరిగా వాడుతూ ఉంటాం. పసుపు యాంటీబయటిక్ గా పనిచేస్తుంది. పసుపులో కేవలం వంటల్లో మాత్రమే కాకుండా పలు ఆయుర్వేదిక మెడిసిన్ లో కూడా వాడుతూ ఉంటారు. ఇందులో కర్కుమిన్ అనే జీవక్రియ సంయోగం ఉంటుంది. దీంతో శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అలాగే జాయింట్ పెయిన్, ఆర్థరైటిస్, కండరాలు వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించి సేల్స్ ను రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా అందించే ఆహార పదార్థాల్లో పసుపు మొదటిగా ఉంటుంది. అయితే మార్కెట్లో దొరికే పసుపు చాలా వరకు కల్తీమయంగా మారుతుంది. మరి నకిలీ పసుపును ఎలా గుర్తించాలి?
కొంతమంది పసుపు అనగానే మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపును కొనుగోలు చేస్తారు. ఎందుకంటే మార్కెట్లో దొరికే పసుపు కొమ్ములను కొనుగోలు చేసి దానిని మర పట్టించే సమయం ఉండదు అని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొంతమంది నకిలీ వ్యాపారుల పంట పండుతోంది. సమయం లేదని లేదా నిర్లక్ష్యంగా ఉండడంవల్ల అసలైన పసుపుకు బదులు కల్తీ పసుపును వాడుతున్నారు. అచ్చం పసుపులా ఉండే కొన్ని రకాల పదార్థాలతో నకిలీ పసుపును తయారు చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ పసుపును పూజలకు ఉపయోగించడమే కాకుండా వంటల్లోను ఉపయోగించడం వల్ల కొంతమంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. యాంటీ సేఫ్టీ కు ఉపయోగపడే పసుపు రోగాలను తీసుకురావడంలో ప్రధానంగా ఉండడంపై చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే అసలైన పసుపు ఎలా ఉంటుంది? నకిలీ పసుపును ఎలా గుర్తించాలి?
నకిలీ పసుపులో మెటానిల్ ఎల్లో అనే కెమికల్ రంగును కలుపుతారు. వాస్తవానికి ఇదే నిషేధిత రంగు. ఈ కెమికల్ రంగును కలిపిన పసుపును వాడడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. ఇలా కెమికల్ కలిపినా పసుపును చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తూ ఉంటారు. అంతేకాకుండా సగ్గుబియ్యం పొడి, చనగపిండి, రక్తం పౌడర్ వంటివి కలిపి కూడా నకిలీ పసుపును తయారు చేస్తారు. కొన్ని రకాల పసుపులో మట్టిని కలిపి కూడా దాని బరువును పెంచుతారు. అంతేకాకుండా ఇందులో సువాసన రావడానికి మరికొన్ని పదార్థాలను కలుపుతారు..
అసలైన పసుపు రంగు ముదురుగా ఉంటుంది. దీనిని చేతితో పట్టుకుంటే పెద్దగా అంటుకోదు. అయితే అసలు పసుపును గుర్తించడానికి చిన్న పరీక్ష ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా పసుపు వేయాలి. ఇది మెల్లగా కిందికి జారుతుంది. కానీ కల్తీ పసుపు వెంటనే పసుపు రంగు అయిపోతుంది. ఎందుకంటే ఇది సింథటిక్ కలర్ కాబట్టి. అలాగే ఒక తెల్ల కాగితంపై కొద్దిగా పసుపు రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత పసుపు రంగులోనే కాగితం ఉంటే నిజమైన పసుపు అని గుర్తించాలి. అలా కాకుండా కాగితం మీద ముదురు నారింజ లేక డార్క్ ఎల్లో లైన్ వస్తే అది నకిలీ పసుపు అని గుర్తించుకోవాలి.