Tulsi Plant Benefits: మనకు ఆయర్వేదంలో మన ఇంట్లో పెరిగే అన్ని మొక్కలను వాడుకోవచ్చు. ప్రతి దాంట్లో ఏదో ఒక ఎనర్జీ దాగి ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బోఫాల్ లో జరిగిన వాయువు లీకేజీ ప్రమాదంలో అక్కడ కొన్ని ఇళ్లు కాలుష్యానికి గురి కాలేదు. దీనికి కారణమేంటనే పరిశీలిస్తే వారి ఇంట్లో తులసి చెట్టు ఉన్నట్లు తేలింది. అంటే తులసిలో ఎన్ని రకాల లాభాలున్నాయో అర్థమవుతుంది.
ఆయుర్వేదంలో కూడా తులసికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి మొక్కను ఉంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి కొలవడం సహజమే. కానీ ఇందులో కూడా ఆయుర్వేద గుణాలున్నాయి. దీని వల్ల ఇది జలుబును దూరం చేస్తుంది. కడుపులో ఏవైనా సమస్యలున్నా తులసి ఆకులను నమలడం ద్వారా మన సమస్యలను దూరం చేసుకోవచ్చు.
తులసి మంచి ఆరోగ్య ఔషధంగా పనిచేస్తుంది. నీళ్లలో వేసి మరిగించి తరువత మరిగిన నీరు కాస్త చల్లార్చి తాగుతుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులను మరిగించకుండా నేరుగా కూడా తినొచ్చు. ఇలా కూడా దగ్గు నుంచి దూరం కావచ్చు. ఇలా తులసిలో ఉండే ఔషధ గుణాల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
పాలల్లో మిరియాల పొడి కలుపుకుని తాగడం వల్ల కూడా దగ్గు నుంచి సాంత్వన పొందొచ్చు. ఇలా తులసితో మనకు చాలా మేలైన లాభాలు ఉంటాయి. తులసిని వాడుకుని ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడొచ్చు. వాతావరణ కాలుష్యాన్ని దూరం చేయడంలో కూడా తులసి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఇంట్లో తులసి మొక్కను పెంచుకుని కాలుష్య ప్రభావం నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలి.