Pawan Kalyan- SRH: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రేజ్ అనే పదం ఎత్తితే మనకి మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు ఆయనదే.కేవలం ఆడియన్స్ లో మాత్రమే కాదు,సెలబ్రిటీస్ లో కూడా పవన్ కళ్యాణ్ కి అదే రేంజ్ క్రేజ్ ఉంది.ఒకానొక దశలో ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లేకుండా ఉండేది కాదని అనేవారు.
సుమారుగా 500 కి పైగా చిత్రాలలో పవన్ కళ్యాణ్ క్రేజ్ రిఫరెన్స్ గా వాడుకున్నారు దర్శక నిర్మాతలు.మధ్యలో ఆయనకీ కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి, రాజకీయం కూడా ఆయన దెబ్బ తిన్నాడు, అది మన అందరికీ తెలిసిందే. ఇన్ని నెగటివ్ జరిగినా కూడా ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు, ఇంకా పెరిగింది కూడా.ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ క్రేజ్ ని సినిమా వాళ్ళే కాదు, క్రికెటర్స్ కూడా తెగ వాడేస్తున్నారు.
ఎవరైనా క్రికెటర్ అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడితే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ కి ఆ క్రికెటర్ తల ని మార్ఫింగ్ ద్వారా తగిలించి ఎలివేషన్స్ వేసుకుంటున్నారు. ప్రస్తుతం IPL టోర్నమెంట్ ఏ రేంజ్ ఉత్కంఠ నడుమ కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ టోర్నమెంట్ లో SRH టీం ప్రస్తుతం వరుసగా మ్యాచులు ఓడిపోతూ ఫ్యాన్స్ లో నిరాశని కలిగిలే చేసింది.
అయితే వాళ్లలో జోష్ నింపడానికి SRH టీం తమ ప్లేయర్స్ ని పవర్ స్టార్ తో పోలుస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘బ్రో’ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పోస్టర్ థీమ్ ని వాడుకొని తమ ప్లేయర్ గురించి ట్వీట్ వేస్తూ ‘క్లాస్ ది పవర్ స్టార్’ అని ట్వీట్ వేసింది. ఆ ట్వీట్ కి రీచ్ మామూలు రేంజ్ లో రాలేదు,ఇలా పవర్ స్టార్ క్రేజ్ ని చాలా సార్లు వాడుకుంది SRH టీం.
Klaas the Powerstar ⭐#BroTheAvatar pic.twitter.com/UnQmrGICvx
— SunRisers Hyderabad (@SunRisers) May 19, 2023