Trouble: జీవితం పూల పాన్పు కాదు. పుట్టగానే ఎవరు బంగారు చెంచా నోట్లో పెట్టుకుని ఉండరు. భూమ్మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ సుఖాలతో పాటు కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కొందరు కష్టాలను చూసి భయపడుతూ ఉంటారు. జీవితంలో తమకు మాత్రమే అన్ని కష్టాలు వస్తున్నాయని నిత్యం ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే ఆ కష్టం ఎందుకు వచ్చింది? దాని నుంచి బయటపడడం ఎలా? అనే విషయాలపై పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ఆలోచించుకోవాలి. అంతేగాని వాటికి భయపడి పోవద్దు. మరి మితిమీరిన కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆందోళన కాకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి?
భయం ఉన్న వ్యక్తికి తాడును చూసినా పాము లాగే కనిపిస్తుంది. అలాగే మనసులో ఎప్పటికీ ఆందోళనలతో ఉన్న వ్యక్తికి ప్రతి చిన్న విషయం పెద్ద సమస్యగా మారుతుంది. జీవితం అందరికీ ఆనందకరంగా ఉంటుందని అనుకోలేము. ఉన్న జీవితంలోనే కష్టసుఖాలను అనుభవించాల్సి ఉంటుంది. కొందరికి కష్టం ఉన్నప్పుడు మరొకరికి సంతోషం ఉండవచ్చు. అలా అని ఎదుటివారి సంతోషాన్ని చూసి బాధపడాల్సిన అవసరం లేదు. మీ కష్టాన్ని చూసి ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కష్టం వస్తూనే ఉంటుంది.
కష్టం వచ్చిన వ్యక్తి ముందుగా ఎవరికి వారు ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే ఇలాంటి సమయంలో మంచి స్నేహితులు ఉంటే పర్వాలేదు. కానీ కొందరు మీ కష్టాలను చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. వీరి వల్ల మరింత కుంగిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వారితో ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది. అయితే ఒంటరిగా ఉన్న సమయంలో కష్టం ఎందుకు వచ్చింది? అనే విషయంపై కాకుండా ఎలా బయటపడాలి? అనే దాని గురించి ఆలోచిస్తే కచ్చితంగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.
మీకు కష్టం వచ్చినప్పుడు మీ జీవిత భాగస్వామితో లేదా దగ్గర స్నేహితులతో మాత్రమే షేర్ చేసుకోవాలి. ఎందుకంటే వారు ఏదైనా సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకు వచ్చిన సమస్యను మీరే ఆలోచించుకుంటే భారంగా ఉంటుంది. ఎదుటివారికి చెప్పడం వల్ల మనసు కాస్త తేలికగా మారుతుంది. ఎదుటివారు ఆ సమస్యకు పరిష్కారం చెప్పకపోయినా.. భారం దిగినట్లు అవుతుంది. అందువల్ల కష్టాలు వచ్చినప్పుడు ఇతరులతో పంచుకోవడం అలవాటు చేసుకోవాలి.
కష్టమనేది చెప్పి రాదు.. ఈ సమయంలోనే నాకు ఎందుకు కష్టం వచ్చింది? అనే విషయంపై కాకుండా.. ఈ సమస్యకు పరిష్కారం వెంటనే దొరకకపోతే.. దానిని ఏదో విధంగా వాయిదా వేయాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి అప్పు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఒత్తిడి చేసినప్పుడు మన దగ్గర డబ్బులు లేని పక్షంలో.. ఎదుటివారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒకేసారి డబ్బు అందే అవకాశం ఉండదు. అలా కొన్ని సమస్యలను వాయిదా వేయడం వల్ల మనసు కాస్త రిలాక్స్ అవుతుంది.