https://oktelugu.com/

Trigrahi Yoga 2024: ఫిబ్రవరి 20 నుంచి త్రిగ్రహి సంయోగం.. ఈ రాశులపై ప్రభావం..

మూడు గ్రహాలు ఒకే రాశిలో ప్రయాణించడంతో కుంభ రాశివారికి అనుకోని అదృష్టం రానుంది. వీరికి ఫిబ్రవరి 20 నుంచి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు పెట్టుబడులు లాభిస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : February 6, 2024 / 04:10 PM IST

    Trigrahi Yoga 2024

    Follow us on

    Trigrahi Yoga 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశుల్లో ప్రయాణిస్తుంటాయి. దీంతో కొందరి జీవితాల్లో మార్పులు వస్తుంటాయి. కాలక్రమేణా కొన్ని గ్రహాలు సంవత్సరాల కొద్దీ సమయం తీసుకుంటాయి. ఒక్కోసారి 30 నుంచి 50 సంవత్సరాలకు ఒకసారి ఒక్కో రాశిలో ప్రశేశిస్తుంటాయి. అలాగే ఫిబ్రవరి 20 నుంచి ఏకకాలంలో మూడు గ్రహాలు ఒకేరాశిలో ప్రయాణించనున్నాయి. దీంతో మూడు రాశుల వారికి అదృష్టం రానుంది. శుక్ర, బుధ గ్రహాలు ఫిబ్రవరి 20 నుంచి కుంభ రాశిలో ప్రవేశిస్తాయి. శని గ్రహం ఇప్పటికే కుంభ రాశిలో ఉంది. అంటే ఒకే రాశిలో మూడు గ్రహాలు ప్రయాణించడం వల్ల ఆ రాశివారికి అదృష్టం వరించనుంది. మరో రెండు రాశులపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితే..

    మూడు గ్రహాలు ఒకే రాశిలో ప్రయాణించడంతో కుంభ రాశివారికి అనుకోని అదృష్టం రానుంది. వీరికి ఫిబ్రవరి 20 నుంచి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు సక్సెస్ అవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో ఇతరులకు దానం చేయడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. వైవాహిక జీవితం వారు సంతోషంగా గడుపుతారు.

    త్రిగ్రహి సంయోగం కారణంగా వృషభ రాశిపై ప్రభావం ఉండనుంది. ఈ రాశివారు కొత్త ఉద్యోగంలో చేరుతారు. పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి యోగం. వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. గతంలో పెండింగులో ఉన్న సమస్యలు ఇప్పటి నుంచి పరిష్కారం అవుతాయి. పోటీ పరీక్షల కోసం చేసేవారి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆస్తుల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    మిథునం రాశి వారికి ఈ పరిస్థితితో ప్రయోజనాలు ఉన్నాయి. వీరు ఏ పని మొదలు పెట్టినా అది సక్సెస్ అవుతుంది. శుభ కార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల సంతోషంగా ఉంటారు. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.