OnePlus 12R: మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారు లేటెస్ట్ ఫీచర్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అలాగే కెమెరా పిక్సెల్స్, డిస్ ప్లే వంటి వాటి గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఫీచర్లు ఉన్న మొబైల్ OnePlus బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. దీని నుంచి లేటెస్టుగా OnePlus 12R మొబైల్ జనవరి నుంచి భారత్ లో అందుబాటులో ఉంది. ఇది లేటెస్ట్ ఫీచర్స్ కోరుకునే వారికి మంచి మొబైల్ అని అంటున్నారు. మరి దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ఈ మొబైల్ 6.78 అంగుళాల డిస్ ప్లే AMOLED Pro XDR తో ఉంది. దీనిపై 1-120Hz యాప్స్ రన్నింగ్ ఉంటుంది. 740 జీపీయూ తో కలిసి 8 జనరేషన్ 2 చిప్ సెట్ ద్వారా ఉత్పత్తి చేశారు. ఇందులో 16 జీబి Ram, 256 జీబీ UFS4.0 స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో స్మార్ట్ ఫోన్ 5,500 mAh బ్యాటరీతో నిర్మీతమైంది. 100W Uper Vooc ఛార్జర్ ద్వారా వేగంగా ఛార్జింగ్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే 50 MP సోనీ 890 ప్రైమరీ సెన్సార్, 8 Mpఅల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.
OnePlus 12 R ను ఆఫర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. 8 జీబీ ర్యామ్ 128 స్టోరేజ్ మొబైల్ రూ.39,999 తో విక్రయిస్తున్నారు. 16 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ వేరియంట్ ఉన్న మొబైల్ రూ.45,999 తో కొనుగోలు చేయవచ్చు. బ్లూ, ఐరన్ గ్రే కలర్లో లభిస్తున్న ఇందులో హై రెస్ మోడ్, ప్రో మోడ్, మూవీ మోడ్, అల్ట్రా స్టెడీ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, పనో, మాక్రో, స్లో వంటి ఫీచర్లతో అలరిస్తుంది. ఈ మొబైల్ ను ఆప్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో కొనగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు ఉంటుంది.