Tragedy : ఒక ప్రశ్నకు సంబంధించిన విషయాన్ని కోరాలో వెతకవచ్చు. ఇందులో ఒక ప్రశ్న అడిగితే చాలు ప్రపంచంలోని నలుమూలలా ఉన్న ప్రజల్లో ఎవరో ఒకరు కచ్చితంగా సమాధానం చెబుతారు. కొందరు వారి వ్యక్తిగత జీవితాల గురించి కూడా పంచుకుంటారు. అయితే దేవర సాగ అనే వ్యక్తి తన జీవితంలో జరిగిన ఓ దురదృష్ట సంఘటనను పంచుకున్నారు. అది తెలిస్తే కన్నీళ్లు ఆగవు. ఇంతకీ అదేంటంటే..
తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు అట దేవరసాగ. 2008 ఏప్రిల్ లో వచ్చిన ఉగాది పండగకు తన అమ్మానాన్న ఫోన్ చేసి రమ్మన్నారట. పండగకు పెద్దమ్మ కూతురు బావ వస్తున్నారని వారికి బట్టలు పెట్టాలని చెప్పిందట తల్లి. వారికి కూడా చాలా సంవత్సరాలకు పిల్లలు పుట్టారట. ఇక సోమవారం పండగ అని ఆదివారం అందరికీ గిప్టులు, బట్టలు, స్వీట్లు కొని ఇంటికి బయలు దేరాడట. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పనులు జరుగుతున్న సమయంలో తన అమ్మానాన్న అక్కడ పనిచేసేవారట.
ఆ పనులు జరుగుతున్న సమయంలో లోపలికి వెళ్లాలంటే గేట్ పాస్ తీసుకోవాలట. అందుకే బయటే వెయిట్ చేశారట. అప్పుడు తన తల్లి తండ్రి పాస్ తీసుకొని కొడుకు వద్దకు వస్తుందట. అమ్మ వస్తుందనే సంతోషంతో ఉన్న తనకు ఒక హఠాత్పపరిమాణం చోటుచేసుకుంది అని చెప్పారు. ఒక మహిళ తన వద్దకు వచ్చి మీ అమ్మ ట్రాక్టర్ కింద పడింది చాలా దెబ్బలు తాకాయి అని చెప్పిందట. ఆ సంఘటనతో వెంటనే వెళ్లేసరికి అమ్మ ప్రాణాలతోనే ఉందట. వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్లారట.
ఆస్పత్రికి వెళ్లే లోపు తన తల్లి చనిపోయిందట. ఆ తర్వాత ఎన్నో అవమానాలు పడ్డారట. తల్లిని పొట్టన పెట్టుకున్నాడని అవమానించారట. కొడుకు వల్లే అమ్మ చనిపోయిందని తిట్టారట. అలా అవమానాలు పడి..చివరకు అమ్మ మీద ఉన్న ప్రేమతో తన చుట్టాల అమ్మాయినే పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడు ఒక పాప బాబు పుట్టారట. మొత్తం మీద తను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటూ తెలిపారు. కానీ ఒక చిన్న గ్యాప్ లో ఎంత డేంజర్ జరిగిపోయింది కదా. అంతే కాలం ఎవరిని ఎలా ఆడిస్తుందో తెలుసుకోవడం, ఊహించడం కష్టమే.