Karnataka Love Marriage: ప్రస్తుత సమాజంలో తొలి ప్రేమలు వెలి ప్రేమలు అవుతున్నాయి. యువతీ యువకులు తమ సామాజిక వర్గం కాని వారిని పెళ్లి చేసుకున్న క్రమంలో ఇరు కుటుంబాల తల్లిదండ్రులు వారిని వెలి వేస్తున్నారు. అలా చాలా చోట్ల జరుగుతున్నది. కాగా, ఈ క్రమంలోనే కులాంతర వివాహం చేసుకున్న తమ పిల్లలను హతమార్చేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి జరిగింది.

కర్నాటక రాష్ట్రంలో ఈ విషాద ఘటన జరిగింది. ఆరు నెలల కిందట ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి విగత జీవిగా మారింది. అలా యువతి ప్రాణాలు కోల్పోయి పడి ఉండటం చూసి సదరు యువతి విలవిల్లాడిపోతున్నారు. వివరాల్లోకెళితే.. కర్నాటకలోని బనశంకరీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బన శంకరిలోని ఆనేకల్‌లోని జిగణి సమీపంలోని రాజాపుర నివాసి యశ్వంత్‌ను బెంగళూరులోని టీచర్స్ కాలనీకి చెందిన రాణి(28) అనే యువతి లవ్ మ్యారేజ్ చేసుకుంది
Also Read: గోల్డ్ లోన్ తీసుకునేవాళ్లకు శుభవార్త.. తక్కువ వడ్డీతో నిమిషాల్లో రుణం!
యశ్వంత్, రాణిల లవ్ మ్యారేజ్ కు ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. అయినప్పటికీ వారు మ్యారేజ్ చేసుకున్నారు. యశ్వంత్ గవర్నమెంట్ ఎంప్లాయి. కాగా, అది అతనికి ఇది రెండో వివాహం కావడం గమనార్హం. అయితే, ప్రేమ పెళ్లి కావడంతో తనను బాగా చూసుకుంటాడని రాణి భావించింది. అలా ఇరువురు మ్యారేజ్ అనంతరం కాపురం స్టార్ట్ చేశారు. కాగా, తాజాగా రాణి ఇంటిలోపల విగత జీవి అయిపోయింది. ఉరేసుకున్నట్లు ఆమె కనబడింది.
రాణి చనిపోవడం గురించి కనీసంగా ఆమె భర్త కాని, కుటుంబ సభ్యులు కాని పట్టించుకోలేదు. దాంతో కులాంతర వివాహం వల్లే రాణిని భర్త, కుటుంబ సభ్యులు హతమార్చారని రాణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాణి తమ ఇంటికి కోడలు కావడం యశ్వంత్ తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదని, ఈ క్రమంలోనే రాణిని చంపేశారని, ఆ తర్వాత ఆత్మహత్యగా ఉరేసుకున్నట్లు చిత్రీకరించి ఉంటారని రాణి తరఫున బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, జిగణి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: పెళ్లి వయసు మారితే.. జీవితమే మారుతుందా?