Homeబిజినెస్Realme 16T 5G features: మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం Realme కొత్త మొబైల్.. ఫీచర్స్...

Realme 16T 5G features: మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం Realme కొత్త మొబైల్.. ఫీచర్స్ తెలిస్తే టెంప్ట్ కావాల్సిందే..

Realme 16T 5G features: 2026 కొత్త సంవత్సరంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం చాలా కంపెనీలు కొత్త మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా Realme కంపెనీ నుంచి త్వరలో 16 T 5G, P4R 5G అనే మొబైల్స్ రాబోతున్నట్లు సోషల్ మీడియా వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతుంది. అయితే ఈ రెండింటిలో 16 T 5G మొబైల్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయని కొందరు చెబుతున్నారు. ఈనెల చివరి […]

Realme 16T 5G features: 2026 కొత్త సంవత్సరంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం చాలా కంపెనీలు కొత్త మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా Realme కంపెనీ నుంచి త్వరలో 16 T 5G, P4R 5G అనే మొబైల్స్ రాబోతున్నట్లు సోషల్ మీడియా వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతుంది. అయితే ఈ రెండింటిలో 16 T 5G మొబైల్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయని కొందరు చెబుతున్నారు. ఈనెల చివరి వరకు ఈ రెండు ఫోన్లు కూడా మార్కెట్లోకి రాబోతున్నట్లు చెబుతున్నారు. అయితే వీటి ఫీచర్లు ఎలా ఉంటున్నాయో ఇప్పటికే అంచనా వేశారు.. వీరి అంచనాల ప్రకారం ఎలా ఉంటాయంటే?

Realme 16 T 5G అనే మొబైల్ 15 T ki వారసత్వంగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ లో 6. 7 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. మూవీస్ చూసే వారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే అనుగుణంగా ఉండనుంది. అలాగే ఇందులో ప్రాసెసర్ పనితీరు కూడా నేటి తరం వారిని ఆకట్టుకుంటుంది. ఈ మొబైల్ లో మీడియా టెక్ dimensity 8300 ఉండగా.. ఆండ్రాయిడ్ 16, 6 GB నుంచి 8 GB వరకు ర్యామ్ సపోర్ట్ చేయనుంది. అలాగే 128 GB నుంచి 256 GB వరకు స్టోరేజ్ ఉండనుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారికి ఈ మొబైల్ ప్రత్యేకంగా ఉండబోతుందని అంటున్నారు.

ఈ మొబైల్ కెమెరా నేటి తరం ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి అనుగుణంగా ఉండనుంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అలాగే 8 MP మరో కెమెరా కూడా దీనికి పనిచేయనుంది. సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం 32 MP కెమెరా పనిచేయనుంది. ఈ కెమెరా లాంగ్ షాట్స్ కూడా ఎలాంటి నాణ్యత తగ్గకుండా ఫోటోలను తీయగలుగుతుంది. ప్రస్తుత కాలంలో ప్రతి మొబైల్ లో బ్యాటరీ పనితీరు ఎక్కువగా గమనిస్తున్నారు. అలాంటి వారికి అనుగుణంగా ఇందులో 6500 నుంచి 7000 mAh బ్యాటరీని ఉంచారు. ఈ బ్యాటరీ 67 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. రోజువారి వినియోగదారులకు బ్యాటరీ కావాల్సినవారికి ఈ ఫోన్ సపోర్ట్ గా ఉంటుంది.

ఇక ఈ మొబైల్ డిజైన్ ప్రీమియం ఫోన్ వలె ఆకట్టుకుంటుంది. 198 గ్రాముల బరువుతో ఇది చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఈ మార్చి చివరలో విడుదల కానున్న ఈ మొబైల్ ధర వివరాలు అందించినప్పటికీ.. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు దగ్గరగానే ఉంటుందని చర్చించుకుంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper