Homeట్రెండింగ్ న్యూస్Shruti Love: నీ వెంటే నేనంటూ.. బావ లేని లోకంలో ఉండ‌లేన‌ని ఆ యువ‌తి ఏం...

Shruti Love: నీ వెంటే నేనంటూ.. బావ లేని లోకంలో ఉండ‌లేన‌ని ఆ యువ‌తి ఏం చేసిందంటే?

Shruti Love: ప్రేమ అనేది ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ ప్రేమ కోసం యువతీ యువకులు తల్లిదండ్రులను కాదని మరి ముందుకు వెళ్తుంటారు. కాగా, అలా ప్రేమించిన వ్యక్తుల కోసం తల్లిదండ్రులను వదిలేసి మరీ జీవితంలో ముందుకు సాగుతుంటారు. అయితే, మనం తెలుసుకోబోయే ఈ స్టోరిలో ఓ యువతి తను ప్రేమించిన వ్యక్తి చనిపోయాడని తను కూడా ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళితే..కర్నాటకలోని కలబురగి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Shruti Suicide
Shruti Suicide

శ్రుతి అనే 18 ఏళ్ల యువతి కలబురగిలో సెకండరీ పీయూసీ చదువుతోంది. బసవన బగేవది ప్రాంతానికి చెందిన హన్మంత అనే యువకుడితో సదరు యువతికి పరిచయం ఏర్పడింది. సదరు యువకుడు శ్రుతికి బంధువు కూడా. దాంతో ఆ పరిచయం ఇంకాస్త ముదిరింది. అది అలా ప్రేమగా మారింది. అలా ఇద్దరూ ఇంట్లో వాళ్లకు తెలీకుండానే ప్రేమలో మునిగిపోయారు. ఎంచక్కా హాయిగా ప్రేమ లోకంలో వీరిరువురు విహరించారు కూడా. సినిమాలకు, షికార్లకు వెళ్తూ ముందుకు సాగారు. వీరు వరుసకు బావా మరదలు అవడం కూడా కలిసొచ్చింది. ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించారు.

Also Read: ఆరు నెలలు కూడా కాలేదు.. అంతలోనే ప్రేమ పెళ్లిలో విషాదం..

అలా ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లే క్రమంలో అనుకోని విషాదం ఎదురైంది. ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండే హన్మంత దురదృష్టవశాత్తూ కొద్దిరోజుల కిందట కాలు జారి బావిలో పడి చనిపోయాడు. కాగా, ఈ విషయం తెలుసుకుని శ్రుతి క్రుంగిపోయింది. తను ప్రేమించిన మనిషి ఇక లేడనే విషయాన్ని గ్రహించలేకపోయింది. అలా ఏడుస్తూ ఏడుస్తూ కుమిలిపోయింది. జీవితంలో తాను పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలేనా అని క్రుంగిపోయింది. తను ప్రేమించిన వాడిని తలచుకుని అలానే ఉండిపోయింది. కూతురి పరిస్థితి చూసిన ఆమె తల్లిదండ్రులు ఇక మర్చిపోవాలని సూచించారు.

తనకంటూ ఒక జీవితం ఉందని కూతురికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. ఆమెకు మరో పెళ్లి సంబంధం చూశారు. గతం మర్చిపోయి మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండాలని పేరెంట్స్ చెప్పారు.అయితే, హన్మంతపైన ఉన్న ఇష్టాన్ని మాత్రం శ్రుతి చంపుకోలేకపోయింది. క్షణికావేశంలో తొందరపాటు డెసిషన్ తీసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి స్థానంలో మరొకరిని హస్బెండ్‌గా ఊహించుకోలేనని అనుకుంది. ఇంటిలో పేరెంట్స్ లేని టైంలో సూసైడ్ చేసుకుంది.

Also Read: పెళ్లి వయసు మారితే.. జీవితమే మారుతుందా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular