Toxic Relationships:ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఉండాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలాంటి సంబంధాలను ఏర్పరుచుకోవాలి? అనే విషయాలను తల్లిదండ్రుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. అయినా చాలామంది ఇలాంటి వాటిపై పెద్దగా ఫోకస్ పెట్టరు. కానీ ప్రతి ఒక్కరి జీవితానికి ఇవి చాలా అవసరం. అందుకే మౌర్య సమాజం కాలంలోనే అపర చాణక్యుడు ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విలువైన విషయాలను చెప్పాడు. వాటిలో ఇంటికి పిలిచే బంధువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నాడు. ఇంటికి ఎవరిని ఆహ్వానించాలి? ఎవరిని పిలవకుండా ఉండాలి? ఎవరితో సంబంధాలు కొనసాగించాలి? అనే విషయాలపై పకడ్బందీగా ఉండాలని అంటున్నారు. లేకుంటే భవిష్యత్తులో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నాడు. ఇంతకీ ఇంటికి ఎవరిని పిలవకుండా ఉండాలి?
తెలివైన మోసగాళ్లు:
కొందరు తమ తెలివితో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మాటలతో మభ్యపెడతారు. వారి మాటలను చూస్తే ఎంతో ఆప్యాయత ఉన్నట్లు కనిపిస్తుంది. దగ్గర బంధువుల లాగా.. దగ్గర స్నేహితుల లాగా.. వీరి ప్రవర్తన ఉంటుంది. కానీ మన ముందు మంచిగా ఉండి.. మనం లేనప్పుడు ఆరోపణలు చేస్తూ.. తిట్టేవారిని ఎప్పటికీ ఇంటికి ఆహ్వానించదు. ఇలాంటివారు ఇంటికి వస్తే ఇంట్లో విషయాలను బయట చెప్పే ఆస్కారం ఉంటుంది. అందువల్ల వీరి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
Also Read: మీ పిల్లలు ఇలా చేస్తున్నారా? తప్పు మీదే.. ఎలాగంటే?
అవకాశవాదులు:
కేవలం అవసరం ఉంటేనే మాట్లాడే కొందరు వ్యక్తులు ఉంటారు. వీరు ఆపద సమయంలో.. అవసరం ఉన్న సమయంలో ముందుకు రారు. తాము బిజీగా ఉన్నామని.. తీరిక లేదని చెబుతూ ఉంటారు. కానీ తమకు అవసరం ఉన్నప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తారు. తమ పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలుపుతారు. ఇలాంటి వారిని కూడా ఇంటికి పిలవకుండా ఉండాలి. ఎందుకంటే ఇంటికి వచ్చిన సమయంలో వారు తమ గురించి మాట్లాడుతూ.. తమకు అవసరమైన పనులు మాత్రమే చేస్తారు. మరోసారి ఆతిథ్యం ఇచ్చిన వారిని పట్టించుకోరు.
బాధపెట్టేవారు:
కొందరు ఎప్పటికీ ఏదో ఒకటి చెబుతూ బాధపడుతూ ఉంటారు. వాళ్లకు జరిగిన కష్టాలను చెబుతూ ఉంటారు. బాధకు సంబంధించిన విషయాలని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారి వల్ల మనసు ఆందోళనగా మారుతుంది. ఇలాంటి వారు ఇంటికి వస్తే ఇంట్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. దీంతో ఆ రోజంతా బాధతోనే గడుపుతారు. అందువల్ల ఇలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది.
నెగెటివ్ ఆలోచనలు:
చాలామందికి పాజిటివ్ ఆలోచన కంటే నెగిటివ్ ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ఒక విషయంలో ఎక్కువగా తప్పులు ఎక్కువ వెతికే వారే ఈ సమాజంలో ఎక్కువగా ఉన్నారు. ఇలాంటివారిని ఇంటికి ఆహ్వానిస్తే.. వారికి చేసే మర్యాదల్లోనూ తప్పులు వెతుకుతారు. అంతేకాకుండా బయట తమకు జరిగే అన్యాయాల గురించి.. ఆపదల గురించి మాత్రమే మాట్లాడుతారు. వీరితో ఉండడం వల్ల ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు.
ఇలాంటి నాలుగు రకాల వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటూ.. వారిని ఇంటికి ఆహ్వానించకుండా ఉండాలి. ఒకవేళ అనుకోకుండా వచ్చిన వారితో ఇన్నర్ విషయాలు చెప్పకుండా ఉండాలి.