https://oktelugu.com/

Improve married life: వైవాహిక జీవితాన్ని మెరుగు పరచుకోవాలంటే.. ఈ నియమాలు పాటించాల్సిందే? 

ప్రస్తుతం చాలా మంది వైవాహిక బంధంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంధంలో ఇబ్బందులు రావడానికి ముఖ్యం భాగస్వాముల మధ్య సరైన కమ్యునికేషన్ లేకపోవడమే. ఇద్దరి మధ్య బంధం సరిగ్గా లేకపోతే వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు. కొత్తగా పెళ్లయిన వారిలో, చాలా ఏళ్లు అవుతున్న వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 7, 2024 / 03:48 PM IST

    improving-Marriage-life

    Follow us on

    Improve married life: ప్రస్తుతం చాలా మంది వైవాహిక బంధంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంధంలో ఇబ్బందులు రావడానికి ముఖ్యం భాగస్వాముల మధ్య సరైన కమ్యునికేషన్ లేకపోవడమే. ఇద్దరి మధ్య బంధం సరిగ్గా లేకపోతే వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు. కొత్తగా పెళ్లయిన వారిలో, చాలా ఏళ్లు అవుతున్న వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. వైవాహిక బంధం సంతోషంగా ఉండాలా? వద్దా? అనేది భాగస్వాముల మధ్యనే ఉంటుంది. ఇద్దరి మధ్య ఉండే కమ్యూనికేషన్ బట్టి మాత్రమే ఉంటుంది. కొందరు సంతోషంగా ఉండటానికి కంటే గొడవలకు ఎక్కువగా తావు ఇస్తారు. వీటివల్ల ఇద్దరి మధ్య బంధం దూరం అవుతుంది. కానీ దగ్గర కాదు. వైవాహిక బంధం జీవితాంతం బాగుండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. మరి పాటించాల్సిన ఆ నియమాలేంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    అపార్థాలకు తావు ఇవ్వకూడదు
    వైవాహిక బంధంలో అపార్థాలు అనేవి సర్వసాధారణం. అయితే వీటిని పెంచుకుంటూ పోకూడదు. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అపార్థాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా సంతోషంగా ఉండగలరు.
    గౌరవించుకోవాలి
    భార్యాభర్తల మధ్య గౌరవం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఏ విషయంలో అయిన కూడా ఇద్దరిని ఒకరు అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. బంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో.. గౌరవం కూడా అంతే ముఖ్యం. గౌరవం లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. దీంతో వైవాహిక బంధం అంతా సర్వనాశనం అవుతుంది. వైవాహిక బంధాన్ని మెరుగు పరచుకోవాలంటే.. ఇలాంటి చిన్న నియమాలు పాటించాలి.
    ముందే ఆలోచించవలసిన అవసరం లేదు
    కొందరు భాగస్వామి ఏం చెబుతారో అని ముందే ఫిక్స్ అయిపోతారు. దీనివల్ల వారు ఏదైనా విషయాన్ని చెప్పకముందే వీళ్లు చెప్పేస్తారు. వాళ్లు అదే అనుకుంటే పర్లేదు. కానీ అది కాకపోతే ఇంకా అంతే సంగతి. దీనివల్ల ఇద్దరి మధ్య మళ్లీ అపార్థాలు మొదలవుతాయి. దీంతో వైవాహిక బంధం ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. అసలు బంధంలో సంతోషమే ఉండదు. వైవాహిక బంధం సంతోషంగా ఉండాలంటే అన్ని మీకు మీరే ఎక్కువగా ఆలోచించుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
    సంతృప్తి చెందడం లేదా?
    వైవాహిక జీవితంలో కొందరు అసలు సంతృప్తి చెందరు. భాగస్వామి ఎంత మంచిగా ఉన్నా సరే.. ప్రతిదానికి వంక పెడతారు. భాగస్వామి సంతోషం కోసం ఏం చేసిన కూడా అర్థం చేసుకోరు. ఎంత ప్రేమ చూపించిన, విలువ ఇచ్చిన కూడా ఇవ్వలేదని అంటారు. అసలు భాగస్వామి ఏం చేసిన సంతృప్తి చెందకుండా గొడవ పడుతుంటారు. దీనివల్ల ఇద్దరి వైవాహిక బంధంలో గొడవలు వస్తాయి.
    భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి
    ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించుకుని అర్థం చేసుకోవాలి. భాగస్వామి ఏం ఫీల్ అవుతున్నారో.. తెలుసుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.