Delhi Weather: వాతావరణం ఎప్పుడు ఎలా సడెన్ గా మారుతుందో చెప్పడం కష్టమే కదా..? మారిందని, మారబోతోందని మాత్రం శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. అయితే, దేశ రాజధాని ఢిల్లీ విషయంలో వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు చేస్తోంది. రుతుపవనాల కాలం దాదాపుగా ముగిసింది. అంటే వర్షాకాలం ముగిసిందన్న మాట. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా తిరోగమన రుతుపవనాలు అప్పుడప్పుడు కొంత వర్షంను చిలకరించి వెళ్తున్నాయి. ఇక వచ్చే శీతాకాలానికి ఈ వానలు మార్గం సుగమం చేస్తున్నాయి. అయితే, ఢిల్లీలో ఎండ తీవ్రత ప్రజలను కొంత కలవరపెడుతోంది. మరో 10 రోజుల పాటు ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. రానున్న 3, 4 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉంది. క్షీణత కొనసాగుతుంది. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత తగ్గడానికి 10 నుంచి 15 రోజులు పట్టవచ్చు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆదివారం (అక్టోబర్ 06) రోజున కూడా ఉదయం, సాయంత్రం వాతావరణం అనుకూలంగా ఉంది.
కానీ మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత కొంత ప్రజలను కలవరపెట్టింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 35.7 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే డిగ్రీ ఎక్కువ. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 24.8 డిగ్రీలుగా ఉంది. ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికం. గాలిలో తేమ స్థాయిలు 35 నుంచి 90 శాతం మధ్య కదలాడాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు వేడి కూడా ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది.
వాతావరణం ఎలా ఉంది?
సోమవారం (అక్టోబర్ 07) ఆకాశం నిర్మలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. మధ్యాహ్నం ప్రకాశవంతమైన సూర్యరశ్మి ఉంటుంది.
ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 36 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. అంటే 24 డిగ్రీల సెల్సియస్ నుంచి 23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఆ తర్వాత కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతూనే ఉంటాయి. అక్టోబర్ 3వ వారం నాటికి, ప్రజలు రాత్రి కొద్దిగా చల్లదనాన్ని అనుభవించవచ్చు.
అంటే ఇంకా కొన్ని రోజుల్లో ఢిల్లీ వాసులు చలితో వణికే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కేవలం పది నుంచి 15 రోజుల్లో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని శరీరం విపరీతంగా కూల్ అవుతుందని, మందపాటి దుస్తులు ధరించాలని సూచనలు చేస్తున్నారు.
&
— RWFC New Delhi (@RWFC_ND) October 6, 2024