Successful in Life: జీవితంలో కోరిన కోరికలు నెరవేరాలని ఎక్కువ మంది భావిస్తారు. ఎన్ని కష్టాలు పడిన కూడా లైఫ్ లో విజయం సాధించాలని తాపత్రయ పడుతుంటారు. అసలు విజయం ఉరికే రాదు. మనం కష్టపడే విధానం మీద వస్తుంది. జీవితంలో విజయం సాధించాలని చాలా మంది గట్టిగా కోరుకుంటారు. కానీ దానికి తగ్గట్లుగా ప్రయత్నించరు. మనం అనుకున్నవి అన్ని దక్కాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. అలాగే వాళ్లకు ఉండే లక్షణాల బట్టి విజయం అనేది సిద్దిస్తుంది. డబ్బులు ఊరికే రావు ఎలాగో విజయం కూడా ఊరికే రాదు. అదంతా మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజుల్లో చాలా మంది విజయం కావాలని ఎంతో అనుకుంటారు. కానీ దానికి తగ్గట్లుగా ప్రవర్తించరు. కనీసం ఒక పది శాతం కూడా విజయం కోసం కష్ట పడరు. తరువాత బాధ పడుతుంటారు. విజయం కోసం సరిగ్గా కష్టపడని వాళ్లు తరువాత బాధపడటానికి అర్హత లేదు. అదే సరిగ్గా విజయం కోసం ప్రయత్నిస్తే.. తప్పకుండా వస్తుంది. అయితే విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరికి నాలుగు లక్షణాలు ఉండాల్సిందే. అప్పుడే విజయం సాధించగలరు. మరి ఆ లక్షణాలు ఏంటో చూద్దాం.
ధైర్యం
కొందరు అన్ని విషయాలకి భయపడుతుంటారు. ధైర్యం చేసి ఏది కూడా ముందు అడుగు వేయలేరు. ఏమవుతుందో అని భయంతో కొన్ని పనులను మధ్యలోనే ఆపేస్తారు. దీని వల్ల విజయానికి దగ్గరగా వెళ్లి ఆగిపోతారు. గెలిస్తాం, ఓడిపోతామో తెలీదు. కానీ మన ప్రయత్నం అనేది మాత్రం ఆపకూడదు. అపుడే విజయం సిద్ధిస్తుంది. కాబట్టి దేనికి భయపడి ప్రయత్నించడం మాత్రం ఆపవద్దు.
ముందుచూపు
ఏ పని చేసిన జీవితంలో కాస్త ముందు చూపు ఉండాలి. ఒక పని చేస్తున్నాం అంటే తరువాత ఏమవుతుందో అలోచించి తీరాలి. ఆలా ఆలోచించకుండా ఏమి అయితే అది అనుకోకూడదు. ఒక పూట భోజనం తినేస్తే ఆకలి తీరిపోదు. మూడు పూటలు భోజనం ఎలా అనే ఆలోచన ఉండాలి. అప్పుడే ఏ విషయంలో అయిన విజయం సాధించగలరు.
తెలివి
ప్రతి మనిషికి తెలివి ఉండాలి. ఏ పనిని అయిన చేయాలంటే తప్పనిసరిగా ఆలోచించే గుణం ఉండాలి. అప్పుడే దేనిని అయిన చిటికెలో చేస్తారు. తెలివి ఉన్న వాళ్లు ఎలాంటి సమస్యల నుంచి అయిన తప్పకుండా బయటపడతారు.
సమర్థత
కొందరు ఏ పనిని అయిన చేయాలని పట్టుదలతో ఉంటారు. కానీ వాళ్లకు అంత సామర్థత ఉండదు. ఏ పనిని అయిన చేయగలిగే సామర్థత ఉంటేనే జీవితంలో తప్పకుండా విజయం సాధించగలరు. ప్రతి ఒక్కరికి ఈ నాలుగు లక్షణాలు ఉండాల్సిందే. అప్పుడే జీవితంలో అనుకున్నవి అన్ని సాధించగలరు.