https://oktelugu.com/

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8′ కంటెస్టెంట్ ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం..ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోతుందా?

మొదటి వారం లో జోక్స్ వేస్తూ, టాస్కులలో చురుగ్గా పాల్గొనే శేఖర్ రెండవ వారం పూర్తిగా డల్ అయిపోయాడు. నా భార్య పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని, ఈ టెన్షన్ తో తాను గేమ్ ఆడలేనని, ఏదైనా అవకాశం ఉంటే నన్ను ఎలిమినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసాడు శేఖర్ బాషా.

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2024 / 10:19 PM IST

    Bigg Boss Telugu 8 Prerna

    Follow us on

    Bigg Boss 8 Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ లోకి రాగల సత్తా ఉన్న కంటెస్టెంట్ ప్రేరణ కంభం. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘కృష్ణ ముకుంద మురారి’ అనే టాప్ రేటెడ్ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు రేంజ్ లో లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ఈమె అనేక ఎంటెర్టైమెంట్ షోస్ లో కనిపించింది. ముఖ్యంగా ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ గేమ్ షో లో అద్భుతంగా టాస్కులు ఆడి మగవాళ్ళను సైతం బయపెట్టేసింది. అప్పుడే ప్రేక్షకులకు అనిపించేది, ఈమె ఇక్కడ ఉండాల్సిన అమ్మాయి కాదు, బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సిన అమ్మాయి, అక్కడ ఉంటే టాస్కులు చింపేస్తుంది, టైటిల్ కొట్టేస్తుంది అని అనుకున్నారు. ప్రేక్షకులు కోరుకున్నట్టు గానే ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. తన మార్కులో టాస్కులో ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

    అయితే ఇలాంటి సమయంలో ఆమెకి ఒక బ్యాడ్ న్యూస్. ఇది ఆమె వరకు చేరిందో లేదో తెలియదు కానీ, మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ టీం ఆమెకి తెలియచేసే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రేరణ కి ఎంతో ఇష్టమైన ‘అమ్మమ్మ’ నేడు చనిపోయిందట. గత కొంతకాలం నుండి అనారోగ్యం తో బాధపడుతున్న ఆమె, నేడు తెల్లవారు జామున కన్ను మూసినట్టు తెలుస్తుంది. ప్రతీ చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోయే ప్రేరణ, ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అమ్మమ్మ చనిపోయింది అనే బాధతో ఆమె హౌస్ లో ఉండగలదా..?, టాస్కులు ఆడగలదా అనేది చూడాలి. గత వారం లో శేఖర్ బాషా కి తన భార్య డెలివరీ తేదీ దగ్గరకు వచ్చే కొద్దీ ఎమోషనల్ గా బాగా వీక్ అవుతూ వచ్చాడు.

    మొదటి వారం లో జోక్స్ వేస్తూ, టాస్కులలో చురుగ్గా పాల్గొనే శేఖర్ రెండవ వారం పూర్తిగా డల్ అయిపోయాడు. నా భార్య పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని, ఈ టెన్షన్ తో తాను గేమ్ ఆడలేనని, ఏదైనా అవకాశం ఉంటే నన్ను ఎలిమినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసాడు శేఖర్ బాషా. అంతే కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఏదైనా అవకాశం వస్తే నన్ను ఎలిమినేట్ చేయండి అన్నాడట. ఆయన కోరిక మేరకే బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే విధంగా ప్రేరణ విషయంలో కూడా చేస్తారా?, ఆమె బయటకి వెళ్ళాలి అని కోరుకుంటే శేఖర్ బాషా ని పంపిన పద్దతి లోనే పంపిస్తారా? , లేదా గంగవ్వ, సంపూర్ణేష్ బాబు ని ఎలా అయితే బయటకి పంపారో, అలా పంపిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. చూడాలి మరి వీకెండ్ లో నాగార్జున ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది.