Height Weight: ఎక్కువ మందికి బరువు పెరిగితే అసలు నచ్చదు. బరువు తక్కువగా ఉండి ఫిట్ గా ఉండాలని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే అసలు లావుగా ఉండటానికి ఇష్టపడరు. దీనికోసం ఎన్నో కసరత్తులు కూడా చేస్తుంటారు. అయితే కొందరు బరువు ఎక్కువగా ఉంటారు. కానీ ఎత్తు సరిగ్గా ఉండరు. సాధారణంగా మనం ఉండే ఎత్తు బట్టి బరువు ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన ఎత్తుకి సరైన బరువు లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మీరు ఉన్న ఎత్తుకి ఎంత బరువు ఉండాలో మరి తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
ఎత్తుకి తగ్గట్లుగా బరువు ఉంటేనే.. ఆరోగ్యంగా ఉండటంతో పాటు చూడటానికి చక్కగా ఉంటారు. ఉదాహరణకి 160 సె. మీ ఉన్న పురుషులు 60 కిలోల బరువు ఉండాలి. అదే అమ్మాయిలు అయితే 55 కిలోల బరువు ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు అని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే 5 అడుగులు కంటే తక్కువ ఉన్న వ్యక్తులు 42 నుంచి 51 కిలోల బరువు ఉండాలి. అదే 5 అడుగుల 2 అంగుళాలు ఉన్నవాళ్లు 43 నుంచి 61 కిలోల బరువు ఉండవచ్చు. 5 అడుగుల 4 అంగుళాల నుంచి 5 అడుగుల 6 అంగుళాల మధ్య ఉన్న వాళ్లు 49 నుంచి 57 కిలోల బరువు ఉండవచ్చు. 5 అడుగుల 8 అంగుళాలు ఉన్న వాళ్లు 56 నుంచి 71 కిలోల బరువు ఉండాలి. 6 అంగుళాలు ఉన్న వాళ్లు 80 కిలోల బరువు ఉండవచ్చు. అంత కంటే ఎక్కువగా ఉంటే అధిక బరువుగా చెబుతుంటారు. అయితే దేశంలో పురుషులు సగటు ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు, అదే మహిళలు అయితే 5 అడుగుల 3 అంగుళాలు ఉంటారు.
పిల్లలు ఎంత బరువు ఉండాలంటే?
చిన్న పిల్లలు తక్కువగా ఎత్తు, బరువు ఉంటారు. అయితే 4 నెలల పిల్లలు 62 సెం.మీ ఎత్తు ఉండి.. 6.5 కిలోల బరువు ఉండాలి. ఆరు నెలల పిల్లలు 64 సెం.మీ ఉండి 7.5 కిలోల బరువు ఉండాలి. తొమ్మిది నెలల పిల్లలు 70 సెం.మీ ఎత్తు, 8.5 కిలోల బరువు ఉండాలి. పన్నెండు నెలల పిల్లలు 74 సెం.మీ ఎత్తు, 10 కిలోల బరువు ఉండాలి. ఏడాది తరువాత పిల్లలు 80 సెం.మీ ఎత్తు, 11 కిలోల బరువు ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు తొందరగా ఎత్తు పెరగడం లేదంటే.. పాల పదార్థాలు ఎక్కువగా తినిపించాలి. అప్పుడే పిల్లలకు ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ల బరువుకి తగ్గట్లు ఎత్తు పెరుగుతారు.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.