Tips: ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్న ఏదో విధంగా దరిద్రంగా మారుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే కొన్ని ప్రదేశాలు అయితే నల్లగా మారిపోతాయి. రోజులు తరబడి వీటిని శుభ్రం చేయకుండా వదిలేయడం వల్ల కొన్నింటికి ఉన్న మురికి పోదు. కొందరు ఇతర పనులతో బిజీగా ఉండటం, ఆరోగ్యం బాలేకపోవడం, పిల్లలు అశుభ్రంగా చేయడం వల్ల మురికి పోకుండా అలా ఉండిపోతుంది. ఇళ్లు అన్న తర్వాత కనీసం నెల రోజులకు అయిన కూడా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే బయట ధూళి వల్ల ఇళ్లంతా నిండిపోతుంది. దీంతో ఇంట్లోని కొన్ని వస్తువులే కాకుండా దుస్తులు కూడా ధూళితో నిండిపోతాయి. సాధారణంగా అందరూ డైలీ పూజిస్తారు. ఇలా పూజిస్తే కొన్ని సామానులను డైలీ వాడకుండా అలా ఉంచేయడం వల్ల అవి నల్లగా మారిపోతాయి. ఎప్పుడైనా పూజ చేయడానికి తీస్తే అవి బాగా నల్లగా కనిపిస్తాయి. వాటిని శుభ్రం చేసిన కూడా ఒక్కసారి వాటి మీద ఉండే మరకలు తొలగిపోవు. వీటిని తొలగించడానికి చాలా కష్టపడుతుంటారు. ఇలా ఇంట్లో మురికిని మాయం చేయడానికి పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పేస్ట్‌తో నల్లగా ఉన్న వస్తువులను తెల్లగా మార్చవచ్చు. ఇంతకీ ఏ వస్తువులను పేస్ట్‌తో తెల్లగా మార్చవచ్చో తెలుసుకుందాం.
బట్టలపై పడే పసుపు మరకలు
ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా బట్టల మీద మరకలు అయిపోతాయి. ముఖ్యంగా పండుగ సమయాల్లో అయితే పసుపు మరకలు అవుతుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి టూత్‌పేస్ట్ బాగా ఉపయోగపేడుతుంది. పసుపు పడిన బట్టలపై టూత్‌పేస్ట్‌ను అప్లై చేయాలి. అప్లై చేసిన 5 నిమిషాల తర్వాత మరక పడిన ప్రదేశాన్ని బాగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేస్తే ఈజీగా మరకలు పోతాయి.
ఐరన్ ప్లేట్
కొందరి ఇంట్లో ఐరన్ ప్లేట్ నల్లటి మరకలు అయి ఉంటుంది. దీన్ని శుభ్రం చేయాలంటే టూత్‌పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. ప్లేట్‌పై పేస్ట్ రాసి, మెత్తటి గుడ్డతో రుద్దితే ఆ పల్లెం కొత్తదానిలా తలతలా మెరిసిపోతుంది.
వెండి ఆభరణాలు
సాధారణంగా వెండి పట్టీలు అందరూ పెట్టుకుంటారు. ఇవి తొందరగా నల్లగా మారిపోతాయి. కొందరు ఇంట్లో పూజకి కూడా ఎక్కువగా వెండి వస్తువులు వాడుతుంటారు. ఇవి ఎంత శుభ్రం చేసుకున్న కూడా నల్లగా అయిపోతుంటాయి. వెండి వస్తువులు ఏవైనా తెల్లగా మెరవాలంటే వాటికి టూత్‌పేస్ట్‌ను అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత బ్రష్‌తో మెత్తగా రుద్దితే నల్లగా ఉన్న వెండి సామానులు తెల్లగా మెరిసిపోతాయి.
తెల్లటి షూ మరకలు
తెలుపు రంగు అంటే చాలా మందికి ఇష్టం. తెల్లని దుస్తులు, షులు ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇలా తెల్లటి దుస్తులు, తెల్లటి బూట్లపై పేరుకుపోయిన మురికి, నల్ల మరకలను తొలగించడానికి టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. షూలపై పేస్ట్ అప్లై చేసి బ్రష్‌తో రుద్దితే నల్లని మరకలు తొలగిపోతాయి. ఏ చిన్న మరక పడిన కూడా ఇలా చేస్తే షూలు కొత్తవాటిలా తలతలా మెరిసిపోతాయి.
సింక్‌ని శుభ్రం చేయడానికి..
సింక్‌ను ఎంత శుభ్రం చేసుకున్న కూడా నల్లగా అయిపోతుంది. ముఖ్యంగా సింక్ ట్యాప్ అయితే చెప్పక్కర్లేదు. దీన్ని తెల్లగా మార్చుకోవాలంటే ట్యాప్‌పై పేస్ట్ అప్లై చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే తెల్లగా మెరుస్తుంది. ఇలా వీటికే కాకుండా ఇంకా ఇంట్లో నల్లగా ఉన్న వాటికి ఉపయోగించవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు.